ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ తో దుమ్ము లేపిన సుకుమార్ కూతురు.. ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
సుకుమార్ కూతురు  సుకృతి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొంది. సుకృతికి కూడా సినిమా, ఫ్యాషన్ రంగం వైపే ఆసక్తి ఉంది. భవిష్యత్తులో స్టార్ మోడల్, హీరోయిన్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. తాజాగా ఓ ఫ్యాషన్ షోలో మోడ్రన్ డ్రెస్ లో ర్యాంప్ వాక్ చేసి అదరగొట్టింది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. సుకృతి ఆ ఫోటోలను షేర్ చేస్తూ.. ఫస్ట్ టైం ఫ్యాషన్ మోడల్ గా ఫ్యాషన్ షోకి పనిచేయడం గర్వంగా ఉంది అని తెలిపింది.  దీంతో సుకృతి ఫ్యాషన్ షో ఫోటోలు వైరల్ గా మారాయి. సుకుమార్ కూతురు అప్పుడే ఇంత

 పెద్దగా అయిపోయిందా, ఫ్యూచర్ లో సినిమాల్లోకి వస్తుందేమో అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక పలువురు మోడల్ గా సుకృతి తన ఫస్ట్ ఫ్యాషన్ షో చేసినందుకు అభినందిస్తున్నారు. ఇక టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆర్య సినిమాతో దర్శకుడుగా సిని ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అలా మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఆ తర్వాత ఎన్నో సినిమాలను చేసి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అంతే కాదు ఇప్పుడు

పాన్ ఇండియా డైరెక్టర్గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం పుష్ప టు సినిమాతో బిజీగా ఉన్నాడు సుకుమార్. అల్లు అర్జున్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్ .ఇందులో భాగంగానే సుకుమార్ కూతురు సుకృతి తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో ఈమె కూడా బాగా ఫేమస్ అయ్యింది. తాజాగా ఒక ఫ్యాషన్ షో లో పాల్గొన్న ఈమె అందులో అదరగొట్టేసింది. దీంతో ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మరి సుకుమార్ తన కూతురిని కూడా శని రంగంకి పరిచయం చేస్తాడా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: