ఎంత సేపు మూత్ర విసర్జన చేస్తే.. ఆరోగ్యంగా ఉన్నట్లో తెలుసా?

praveen
మన తీసుకునే ఆహారాన్ని శరీరం వివిధ రకాలుగా విడగొడుతుంది. ఇలా విడగొట్టబడిన ఆహారంలో శరీరం వివిధ పోషకాలను గ్రహించి మిగిలిన వ్యర్థాలను మూత్రం, మల రూపంలో విసర్జిస్తుంది. మనిషి అనేవాడు సగటున రోజుకు 7 సార్లు అయినా మూత్ర విసర్జన చేయాలని డాక్టర్లు చెబుతూ ఉంటారు. నిజమే... అంతకంటే ఎక్కువగా లేదా తక్కువగా చేసినా ఏదో తెలియని సమస్య వున్నట్లే లెక్క. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి మూత్ర విసర్జన కాలం దాదాపు ఏడు సెకన్ల నుండి 20 సెకన్ల వరకూ వుంటుంది. మూత్ర విసర్జన అనిపించినపుడు మూత్రానికి వెళితే 2 సెకన్లు లేదా అంతకంటే తక్కువ సమయంలోపలే మూత్ర విసర్జన పూర్తయితే వారికి ఇన్ఫెక్షన్ సోకిందని గుర్తు పెట్టుకోవాలి.
అదే విధంగా మూత్రం రంగును బట్టి మనిషి ఆరోగ్యాన్ని చెప్పొచ్చని అంటుంటారు వైద్య నిపుణులు. మీ మూత్రం తెల్లగా స్వచ్ఛంగా ఉంటే మీరు శరీరానికి సరిపడా నీరు తాగుతున్నారని అర్థం. అదే మూత్రం ఎరుపు రంగులో వస్తే మాత్రం మూత్రంలో రక్తం కలిసి వస్తుందని అర్ధం. ఇది అలాఅలా యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ గా మారుతుంది. కాబట్టి దీన్ని ఒక సమస్యగా గుర్తించి డాక్టర్ల పర్యవేక్షణలో తగిన మందులు వాడాలి. అలాగే కొందరికి మూత్రం నీలంరంగులో వస్తుంది. ముఖ్యంగా పసిపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీన్ని బ్లూ సైపన్ సిండ్రోమ్ అంటారు. ఇది జన్యులోపం కారణంగా వస్తుంది. పెద్దవారిలో ముఖ్యంగా వయాగ్రా వాడే పురుషుల్లో ఇటువంటి లక్షణం కనబడొచ్చు. ఇక మనం ఎక్కువగా డీహైడ్రేషన్ కు లోనయితే మూత్రం ముదురు రంగులోకి మారుతుంది. లివర్ సమస్యలు, కామెర్ల సమస్యలు ఉన్నపుడు మూత్రం ముదురు పసుపురంగులోకి వస్తుంది. ఇలాంటప్పుడు ఇటివంటి ఆలస్యం చేయకుండా వైద్య నిపుణుల్ని సంప్రదించాలి.
ఇక మూత్ర విసర్జనకు పట్టే సమయాన్ని బట్టి ఆరోగ్య స్థితిని గుర్తించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. మూత్రాశయాన్ని పర్యవేక్షిస్తూ, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జార్జియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలోని మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఓ అధ్యయనం నిర్వహించారు. మనుషులు సుమారు 21 సెకండ్లలో మూత్ర విసర్జనను పూర్తి చేయడం ఆరోగ్యకరమని ఈ అధ్యయనం వెల్లడించింది. పదేపదే మూత్రవిసర్జన చేసినా, తక్కువసార్లు చేసినా ఆరోగ్యానికి నష్టమేనని దానిద్వారా తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: