చంద్ర బాబు: ముందున్న అతిపెద్ద సవాల్ అదే..?

Divya
ఆంధ్రప్రదేశ్ గత కొన్నేళ్లుగా రాజధాని లేదంటూ చాలామంది విమర్శించారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే అమరావతిని రాజధానిగా ప్రకటిస్తానంటూ తెలియజేశారు. అన్నట్టుగానే కూటమిలో భాగంగా 164 సీట్లతో గెలిచారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ చాలామంది టిడిపి నేతలు అభిప్రాయపడుతున్నారు. అన్నట్టుగానే చంద్రబాబు కూడా అమరావతిని డెవలప్మెంట్ చేస్తామని తెలిపారు. అలాగే విశాఖపట్నం ని కూడా ఆర్థిక రాజధానిగా నిర్మిస్తామంటూ వెల్లడించారు. అమరావతిలో భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు కూడా ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారం చేపట్టిన చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణానికి ఏం చేస్తారో అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.

అమరావతి నిర్మాణం అంటే ఆశామాసి విషయం కాదు. చాలా పెద్ద బడ్జెట్ చూడాల్సి ఉంటుంది. అయితే అమరావతి మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ భవనాలను సైతం నిర్మించి ఉంచారంటే చాలు నెమ్మదిగా అది అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ప్రజలతో పాటు అంతా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అమరావతిని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామంటూ చంద్రబాబు విర్రవీగారు. అంతేకాకుండా అనుభవశాలిగా కూడా పేరు పొందారు. ముఖ్యంగా అమరావతి ఏర్పరచడానికి పెద్ద ఎత్తున నిధులు కూడా కావాల్సి ఉంటుంది.

2014 నుంచి 19 మధ్యలో అమరావతికి సంబంధించి కొన్ని పనులు చేయడమే కాకుండా అక్కడ చాలామంది నేతలు భూములను కొనుగోలు చేసినట్లుగా వార్తలు వినిపించాయి. గతంలో కూడా టిడిపి ప్రభుత్వం శాశ్వత నిర్మాణాలను మొదలుపెట్టిన అవి కొంతవరకు జరిగిన ఆ తర్వాత ఐదేళ్లు వరదలకు నిర్మాణాలన్నీ కూడా పోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమరావతి కోసం రైతుల నుంచి సేకరించిన 33 వేల ఎకరాలు.. 22 వేల ప్రభుత్వ భూమిని కలుపుకుంటే మొత్తం మీద 55 వేల ఎకరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇదంతా ఇలా ఉంటే గతంలో నిర్మాణాలు కొంత చేసి మధ్యలో ఆగిపోవడం కూడా జరిగింది. అర్జెంటుగా ఇప్పుడు అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాల్సి ఉన్నది. మరి ఇంత పెద్ద ఖజానాను చంద్రబాబు ఎలా తీసుకు రాగలరు.. అలాగే తాను చెప్పిన పథకాలు, ఉద్యోగుల జీతాలు, డెవలప్మెంట్ వంటివి చేయడమే కాకుండా, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. మరి చంద్రబాబు ముందు ఉన్న అతిపెద్ద సవాల్ అమరావతి కట్టడమే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: