పవనే నన్ను వదిలేసాడు.. వేరే పెళ్లి చేసుకున్నాడు.. రేణు దేశాయ్ షాకింగ్ కామెంట్..??

Suma Kallamadi
మాజీ సినీ నటి రేణు దేశాయ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2009లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2004లో అంటే పెళ్లికి ముందే వీరికి అకీరా పుట్టాడు. తర్వాత పెళ్లి చేసుకుని 2012లో అధికారికంగా విడిపోయారు. ఆ తర్వాత వీరిద్దరూ కలిసింది లేదు కానీ ఆమెతో కలిసి కన్న పిల్లలు మాత్రం మెగా ఫ్యామిలీలో కలిసిపోయారు. ఇప్పటికీ అకిరా పవన్‌తోనే తిరుగుతున్నాడు. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కూడా కలిశాడు. ప్రధాని నరేంద్ర మోదీతో కూడా ఫోటోలు దిగాడు.
అకిరా ప్రముఖులతో కలిసి దిగిన ఫోటోలను  ఇన్‌స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ సంతోషిస్తోంది రేణు దేశాయ్. ఇటీవల ఆమె ఒక కాంట్రవర్సీలో కూడా చిక్కుకుంది. పవన్ మూడో భార్య ఫోటోను ఆమె క్రాప్ చేసి ఓన్లీ పవన్, అకిరా, మోదీలు మాత్రమే కనిపించేలాగా ఒక ఫోటో షేర్ చేసింది. దీనివల్ల ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. పవన్ ప్రస్తుత భార్యని చూసి ఓర్వలేక పోతున్నావా అంటూ ఆమెను చాలామంది తిట్టారు. ఈ ట్రోల్స్ పై ఆమె చాలా తీవ్రంగా స్పందించింది.
 అయితే తాజాగా ఆమె మరొక ట్రోలర్ కి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. సుధాకర్ అనే ఓ పవన్ ఫ్యాన్ రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ.. ”వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడిని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈరోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది. ఈరోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం” అంటూ కామెంట్ చేసాడు.
దీన్ని చదివిన రేణు దేశాయ్ బాగా కోపం తెచ్చుకుంది. ”సుధాకర్ గారు మీకు కొంచెం అన్న బుద్ధి ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ ను నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి ఇలాంటి కామెంట్స్ పెట్టి" అని పవన్ మాజీ భార్య మండిపడింది. అయితే ఇన్ని రోజులు రేణు దేశాయ్ పవన్ వైఖరి నచ్చక దూరమైందని అనుకున్నారు చాలామంది. కానీ రేణు రిప్లైతో ఒక క్లారిటీ అయితే వచ్చింది. పవన్ ఎందుకు ఈమెను వదిలేశారు? రష్యన్ అమ్మాయిని కోరి మరీ ఎందుకు పెళ్లి చేసుకున్నారు? వంటి కోణాల్లో కొంతమంది ప్రశ్నలు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: