హీరోయిన్‌‌‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ఘట్టమనేని గారాల పట్టి..!

murali krishna
టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోస్, రీల్స్ పోస్ట్ చేస్తూ.. ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఓవైపు యాడ్‌లలో నటిస్తూ.. మరోవైపు సేవా కార్యక్రమాలు చేస్తూ చిన్న ఏజ్‌లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు గారాలపట్టి సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సాధారణంగా ఏ స్టార్ కిడ్స్‎కి అయినా ఒక వయస్సు వచ్చాక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. కానీ సితార మాత్రం పుట్టినప్పుడు నుంచే అభిమానులను సంపాదించుకుంది. ఇక వయసు పెరిగే కొద్దీ సితారకు అభిమానుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. పదేళ్లు కూడా నిండకముందే సితార ఒక యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి బోల్డన్ని ముచ్చట్లు చెప్పింది. తరచూ తన తండ్రి మహేష్ తో పాటు కనిపిస్తూ సందడి చేస్తుంది. ఇంకోపక్క సితార తల్లి నమ్రత.. చిన్నప్పటి నుంచి సితారను అభిమానులకు దగ్గరగా ఉంచడంతో వారి మధ్య ఆమె ఒక ప్రిన్సెస్ గా మారిపోయింది. ఇక అతి చిన్న వయస్సులోనే ఈ పాప.. ఇంటర్నేషనల్ ఆభరణాల కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ అయింది. ఇక సోషల్ మీడియాలో సితార నిత్యం డ్యాన్స్ చేస్తూ.. రీల్స్ చేస్తూ తన ఫ్యాన్స్ ను అలరిస్తోంది.

తాజాగా సితార సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పుకొచ్చింది. తనకు హీరోయిన్ కావాలని ఉందంటూ చెప్పుకొచ్చింది. ఇక మహేష్ తో తన అల్లరి, తన అన్నను ఏడిపించిన విధానం అన్ని చెప్పింది. పెద్ద హీరోయిన్ లా ఎంతో హుందాగా, ఓపికగా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పింది. అన్న నుంచి ఓపికగా ఎలా ఉండాలో నేర్చుకోవచ్చని తెలిపింది.తండ్రి నుంచి యాక్టింగ్, తల్లి నుంచి ఫ్యాషన్ సెన్స్ నేర్చుకుంటానని తెలిపింది. ఇక మహేష్ ఖలేజా సినిమాలోని సీతారామరాజు పాత్ర చేయాలని ఉందని తెలిపింది సితార. దాంతో పాటు కొత్తగా వచ్చే యంగ్ ఇన్ ఫ్లూయెన్సర్స్ కు చక్కటి టిప్స్ అందించింది. ఇక లేటెస్ట్ గా వైరల్ అయిన మహేష్ – మంజుల క్యూట్ మూమెంట్ గురించి కూడా సరదాగా చెప్పుకొచ్చింది. నాన్నకు తన హెయిర్ అంటే ఇష్టమని.. అందుకే అత్త టచ్ చేయగానే వద్దని చెప్పాడంటూ తెలిపింది. కాగా సితార పాపకు హీరోయిన్ కావాలనేది కోరిక.. కాగా త్వరలో ఎంట్రీ ఇస్తుందని ఆమె ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: