బన్నీ సరసన త్రిష.. ఏంటీ గురూజీ ఇది.. ఫ్యాన్స్ షాక్?
యంగ్ హీరోయిన్ల పోటీని సైతం తట్టుకొని నిలబడుతుంది అని చెప్పాలి. అయితే గత కొంతకాలం నుంచి త్రిష వార్తలు తెగ హాట్ టాపిక్ గా మారిపోతుంది. ఏకంగా లియో సినిమాలోని ఒక రేప్ సన్నివేశం విషయంలో నటుడు మన్సూర్ అలీఖాన్ త్రిషపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇందుకు కారణం. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ ఇండస్ట్రీ మొత్తం మద్దతుగా నిలబడుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు త్రిష ఒక లక్కీ ఛాన్స్ దక్కించుకుంది అన్న వార్త కూడా వైరల్ గా మారిపోయింది. లియో సినిమా హిట్ అవడంతో ఈ హీరోయిన్ పై టాలీవుడ్ మాటల మాంత్రికుడి కన్ను పడిందట. ప్రస్తుత మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు త్రివిక్రమ్.
ఇక ఈ సినిమా సంక్రాంతి బరిలో ఉంది అని చెప్పాలి. అయితే ఆ తర్వాత అల్లు అర్జున్తో సినిమా ఉంటుందని ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి. దీంతో వీరి కాంబోలో వస్తున్న నాలుగో సినిమాపై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే లియో సినిమా చూశాక ఇక త్రివిక్రమ్ కన్ను త్రిషపై పడిందట. దీంతో బన్నీకి జోడిగా త్రిష అయితే బాగుంటుందని గురూజీ అనుకుంటున్నాడట. కానీ ఈ విషయం తెలిసి అభిమానులు మాత్రం షాక్ అవుతున్నారు. వీరిద్దరి జంట చూడడానికి అసలు బాగోదని.. అక్క తమ్ముడు లాగా ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్ లాంటి హీరోలకే త్రిష సెట్ అవుతుందని.. బన్నీ లాంటి హీరోకి సరిపోదు అంటూ అభిప్రాయపడుతున్నారట ఫాన్స్.