ధ్రువ నక్షత్రం సినిమాపై డైరెక్టర్ లింగు స్వామి కామెంట్స్..!!

Divya
తమిళ నటుడు హీరో చియాన్ విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ధ్రువ నక్షత్రం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయిన ఇంకా విడుదల కాలేదు..కానీ ఇటీవల ఈ సినిమాని విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. నవంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ గత కొద్ది రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. ట్రైలర్ కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది. ఈ ట్రైలర్ కూడా అందరిని ఆకర్షించడం జరిగింది.

ఇప్పుడు తాజాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ లింగు స్వామి ముంబైలో చివరి కట్ ను చూడడం జరిగిందట. ఇది చాలా అద్భుతంగా ఉందని డైరెక్టర్ కూడా ఎంతో అద్భుతమైన విజువల్స్ తో రూపొందించారని చాలా ఇంట్రెస్టింగ్ గా స్టోరీ ఉన్నదంటూ డైరెక్టర్ లింగుస్వామి తెలియజేయడం జరిగింది. ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం ఫుల్ ఖుషి అవుతున్నారు. గత కొద్ది రోజులుగా విక్రమ్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో అటు తమిళ తెలుగు ప్రేక్షకులు కూడా నిరుత్సాహంతో ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే కచ్చితంగా విక్రమ్ సినిమాలన్నీ కూడా భారీ విజయాలను అందుకుంటాయి.

ముఖ్యంగా విక్రం ఎలాంటి సాహసం చేయడానికి అయినా సినిమా కోసం సిద్ధంగానే ఉంటారు. ట్రైలర్ లో కూడా అద్భుతమైన యాక్షన్స్ సన్నివేశాలను చూపించారు.ఇక నిర్మాణ పనులు కూడా చాలా విలువైనవి గా కనిపిస్తున్నాయి. ఈ సినిమా పైన భారీ ఖర్చు పెట్టినట్లుగా కనిపిస్తోంది. రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్, రాధిక ,అర్జున్ దాస్,సిమ్రాన్ తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. మరి డైరెక్టర్ లింగస్వామి తెలియజేసినట్లుగానే ధ్రువ నక్షత్రం సినిమాతో అటు తెలుగు తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాన్ని విక్రమ్ అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: