రోజా కూతురు సినిమాల్లో ఏంట్రీ ఇవ్వనుందా....??

murali krishna
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్లలో రోజా ఒకరు అనే సంగతి తెలిసిందే. రోజా కూతురు అన్షుమాలిక సినీ ఎంట్రీ గురించి వార్తలు కొత్త కాదు.ప్రముఖ దర్శకనిర్మాతలు అన్షుమాలికకు మూవీ ఆఫర్లు ఎక్కువగా ఇస్తున్నారని సమాచారం అందుతోంది. అన్షుమాలిక సినిమా ల్లోకి వస్తే స్టార్ హీరోయిన్ గా సక్సెస్ సాధించడం ఖాయమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రోజా కూతురు ప్రస్తుతం చదువు, కెరీర్ పై పూర్తిస్థాయి లో ఫోకస్ పెట్టారని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో తెలుగు హీరోయిన్లకు ఎక్కువగా ప్రాధాన్యత దక్కుతుండగా అన్షుమాలిక కెరీర్ విషయం లో రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాల్సి ఉంది.అన్షుమాలిక సినిమాలపై ఆసక్తి చూపిస్తే ఆమెకు భారీ స్థాయి లో రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారు. అన్షుమాలికకు సోషల్ మీడియా లో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్షుమాలిక రేంజ్ అంతకంతకూ పెరగాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. రోజా విషయానికి వస్తే నగరి నియోజకవర్గం నుంచి ఆమె ఎన్నికల్లో పోటీ చేయనున్నారని మరోసారి నగరి ఎమ్మెల్యే గా విజయం సాధిస్తాననే నమ్మకాన్ని ఆమె కలిగి ఉన్నారని సమాచారం అందుతోంది.

ప్రజలను ఆకట్టుకోవడానికి రోజా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.   వైసీపీ నేతల లో కొంతమంది మాత్రం రోజాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. రోజాకు ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావాలని నెటిజన్లు కోరుకుంటున్నారు. రోజా భవిష్యత్తులో సినిమాల్లో రీఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.మినిష్టర్ రోజా ప్రస్తుతం వైసీపీ మంత్రిగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు. రోజా జాగ్రత్తగా అడుగులు వేస్తే మాత్రం రాజకీయాల్లో కూడా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతుండటం గమనార్హం. అన్షుమాలిక టాలీవుడ్ ఇండస్ట్రీలో టైర్1 హీరోయిన్ల రేంజ్ కు చేరాలని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: