ఏంటి.. బాహుబలిలో ప్రభాస్ పక్కన కోతి కూడా నటించాల్సిందా?

praveen
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమా గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రూపురేఖలనే మార్చేసింది ఈ సినిమా. సినీ ప్రపంచాన్ని మొత్తం ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ వైపు చూసేలా చేసింది. అయితే ఇప్పటికి బాహుబలి 2 సినిమా రిలీజ్ ఐదేళ్లు గడిచిపోతున్నాయి. అయినా ఏదో ఒక ఇంటర్నేషనల్ ఫ్లాట్ ఫారం పై బాహుబలి కనిపిస్తూనే ఉంటుంది అని చెప్పాలి. బాహుబలి, శివుడు అనే రెండు పాత్రలో ఈ మూవీలో ప్రభాస్  కనిపించాడు.



 బాహుబలి అనే పాత్రలో నటించి తన నటనతో రాజసం చూపించిన ప్రభాస్.. ఇక శివుడు అనే పాత్రలో గిరిజన తెగలో ఉండే అబ్బాయిగా నటించి ఆకట్టుకున్నాడు. అయితే ఇలా శివుడు పాత్ర గురించిన ఒక వార్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రభాస్ నటించిన శివుడు పాత్ర పక్కన ఒక కోతి కూడా నటించాల్సి ఉందట. ఇలాగే రాజమౌళి ముందుగా స్టోరీ రాసుకున్నాడట. ఆ కోతి వల్లే సినిమా స్టోరీ కూడా ముందుకు సాగుతుందట. అయితే శివుడు భారీ జలపాతాన్ని ఎక్కి తమన్నను కలవడానికి వెళ్తాడు అన్న విషయం  బాహుబలి 2 లో చూస్తాం. కానీ ముందు రాసుకున్న కథ ఏంటంటే.. శివుడు తో పాటు ఉన్న కోతి జలపాతం ఎక్కి కొన్ని రోజులకి ఎక్కువ నగలు కిందికి తీసుకొస్తుందట  ఆ నగలతోనే శివుడు అవంతిక రూపాన్ని చెక్కుతాడు. ఇది అసలు స్క్రిప్ట్ కానీ కోతిని ఎఫెక్ట్స్ లో చూపిస్తే నేచురల్ గా కనిపించదని చివరికి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేశాడట రాజమౌళి.


 అంతేకాకుండా షూటింగ్ జరిగిన ప్రాంతంలో ఇక నిజమైన కోతిని పెట్టి షూటింగ్ చేయడానికి రూల్స్ ఒప్పుకోవు. కాబట్టి ఇక రిస్క్ చేయడం ఎందుకు అని భావించి కథలో మార్పులు చేసి ఇక మరో విధంగా తెరకెక్కించాడట జక్కన్న. అయితే రాజమౌళి ఏం చేసినా పర్ఫెక్షన్ తో చేస్తాడు. దీంతో కథలో మార్పులు చేసిన ఇక తన టేకింగ్ తో మాత్రం ప్రేక్షకులను మెప్పించ గలిగాడు జక్కన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: