అన్నపూర్ణ స్టూడియోస్ అప్పుల్లో కూరుకపోతే.. నాగార్జున ఏం చేశారు తెలుసా?

praveen
తెలుగు చిత్ర పరిశ్రమ లో ఉన్న పెద్ద ఫ్యామిలీల లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటిగా కొనసాగుతూ ఉంది. అక్కినేని నాగేశ్వరరావు.. మొదటి తరం హీరోలలో అగ్ర హీరోగా చక్రం తిప్పి ఇక తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచారు. అంతేకాదు నటసామ్రాట్ గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లోచెరగని ముద్ర వేసుకున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే సినీ ఇండస్ట్రీకి నాగేశ్వరరావు కుమారుడు నాగార్జున కూడా హీరోగా పరిచయం అయ్యాడు. అక్కినేని అనే భారీ బ్యాగ్రౌండ్తో పరిచయమైన నాగార్జున.. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో హీరోగా క్లిక్ అయ్యాడు.


 స్టార్ హీరోలలో ఒకడిగా మారిపోయాడు నాగార్జున. అయితే ఇప్పుడు నాగార్జున వారసులుగా నాగచైతన్య, అఖిల్ ఇండస్ట్రీలో హీరోలుగా కొనసాగుతున్నారు. కానీ ఎందుకో తండ్రికి తగ్గ తనయులు అని మాత్రం అనిపించుకోలేకపోతున్నారు ఈ ఇద్దరు హీరోలు. సక్సెస్ కోసం ఎంతో కష్టపడి పోతున్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కినేని కుటుంబానికి చెందిన ఒక వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియో  అప్పులలో కూరుకుపోయిందట


 ఈ విషయాన్ని నాగేశ్వరరావు పెద్ద కొడుకు వెంకట్ తెలిపారు  నాగార్జున హీరో కావాలని తాను ఎంతగానో కోరుకున్నట్లు తెలిపాడు. అయితే ఆ సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్  వ్యవహారాలని తానే చూసుకునేవాడినని.. కొన్ని కారణాల వల్ల తాను అనుపూర్ణ స్టూడియోస్ వ్యవహారాల నుంచి తప్పుకున్నాను  అనంతరం నాగార్జున ఆ బాధ్యతలను తీసుకున్నాడు అని వెంకట్ తెలిపాడు. అయితే గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ అప్పుల్లో కూరుకుపోయింది. అనీ ఆ విషయాన్ని బయట పెట్టకుండా సినిమాలు చేయడం ద్వారా వచ్చిన డబ్బులను ఇక అన్నపూర్ణ స్టూడియోస్ లో పెట్టి నాగార్జున.. అప్పుల నుంచి బయటపడ్డారు అంటూ వెంకట్ చెప్పుకొచ్చారు.కాగా వెంకట్ చేసిన వ్యాఖ్యలు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: