రాంచరణ్ మూవీలో కీలక పాత్ర చేయబోతున్న సీనియర్ నటుడు....!!

murali krishna
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో కొనసాగి ఆ తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చాలా సినిమా ల్లో చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకత ని పొందుతున్న నటుడు రాజేంద్రప్రసాద్ ...ఈయన చేసిన చాలా సినిమాలు ఒకప్పుడు మంచి విజయాన్ని సాధించాయి.అయితే ఇప్పుడు ఆయన హీరోల ఫాదర్ గా నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు.ముఖ్యంగా నాన్న కి ప్రేమతో సినిమా లో ఆయన పోషించిన పాత్ర కి ఒక మంచి గుర్తింపు అయితే వచ్చింది.ఇక ఇప్పుడు ఆయన రామ్ చరణ్ బుచ్చిబాబు కాంభినేషన్ లో వస్తున్న సినిమా లో ఒక కీలక పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని పాత్రల కంటే ఇప్పుడు చేయబోయే పాత్ర చాలా పైవిద్యంగా ఉండబోతున్నట్టుగా ఇండస్ట్రీలో చాలా వార్తలైతే వస్తున్నాయి. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం తమిళ నటుడు ని తీసుకుందాం అనుకున్నప్పటికీ చివరికి ఆయన్ని కాదని రాజేంద్రప్రసాద్ ని తీసుకున్నారు.   అయితే ఆ క్యారెక్టర్ ఇప్పటి వరకు అతను చేయని ఒక కొత్త యాంగిల్ లో ఉండబోతుందనే విషయం కూడా తెలుస్తుంది. ఇక ఇదే నిజమైతే రాజేంద్రప్రసాద్ కెరియర్ లో ఇది ఒక మంచి పాత్రగా మిగిలిపోతుందనే చెప్పాలి.ఇప్పటివరకు ఆయన చేసిన కామెడీ పాత్రలు కాకుండా ఇది ఒక సీరియస్ మూడ్ లో ఉండబోతున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎంతవరకు నటించి మెప్పిస్తాడు అనేది తెలియాల్సి ఉంది...ఇక ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా తొందర్లోనే సెట్స్ మీదకి వెళ్లే అవకాశం ఉంది.ఇక దానికి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో బుచ్చి బాబు ఉన్నట్టు గా తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: