ఆ కారణంగా కష్టాల్లో పడ్డ ఏ ఆర్ రెహమాన్ సాంగ్....!!
ఏఆర్ రెహమాన్ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో రెండు రోజుల క్రితం ఈ పాటను విడుదల చేశారు. బెంగాల్ ప్రజల మనోభావాలతో రెహమాన్ ఆడుకుంటున్నారని కొందరు ఆరోపించారు. ఈ సాంగ్ నిరసనల కోసం ఉపయోగించే ప్రభావవంతమైన పాట. ఇది స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కి ఇష్టమైన పాట. సంవత్సరాలుగా చాలా మంది సంగీత స్వరకర్తలు ఈ పాటకు వారి సొంత వెర్షన్‌లో కంపోజ్ చేశారు. ఇప్పుడు రెహమాన్ కంపోజ్ చేసిన కొత్త పాట సారాంశాన్నిపూర్తిగా మార్చేసిందని అంటున్నారు. దాంతో ఆయన పై విమర్శలు చేస్తున్నారు. రెహమాన్ ఈమధ్య కాలంలో తరచు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. కొన్ని నెలల క్రితం రెహమాన్‌పై వివాదాలు చెలరేగాయి. మొన్నామధ్య చెన్నైలో స్టేజ్ ప్రోగ్రామ్ ఇచ్చారు రెహమాన్. దీని కోసం భారీగా ప్రజలు తరలివచ్చారు. టిక్కెట్లు ఉన్నప్పటికీ పలువురిని లోపలికి అనుమతించలేదు. ఇది చాలా చర్చకు దారితీసింది. ఆ తర్వాత రెహమాన్ క్షమాపణలు కూడా చెప్పాడు.