హీరో సంపూర్ణేష్ బాబు.. ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
ఇలాంటి వార్తలు అంటే ఇంట్రెస్ట్ ఉండే సినీ జనాలు ఇక ఇలాంటిది ఎప్పుడైనా కనిపించింది అంటే చాలు వెంటనే చదివేస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇప్పుడు ఒక చిన్న హీరోకి సంబంధించిన వార్త ఇలాగే వైరల్ గా మారిపోయింది. బర్నింగ్ స్టార్ అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తూ ఉంటాడు సంపూర్ణేష్ బాబు. హృదయ కాలేయం అనే సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస అవకాశాలు కూడా వచ్చాయి. ఆ తర్వాత సింగం, కొబ్బరి మట్ట లాంటి సినిమాలు చేసి తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు.
అయితే అలాంటి సంపూర్ణేష్ బాబుకి ఆస్తులు ఎంత మొత్తంలో ఉన్నాయి అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే సంపూర్ణేష్ బాబు ఇప్పటికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో షూటింగ్ కి వెళ్తారు అన్న విషయం ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాదు ఇక ఆయన దగ్గర ఉన్న 800 కారును ఇప్పటికీ వాడుతూ ఉంటారట. తన సొంత ఊరు సిద్దిపేటలో సైకిల్ పై తిరుగుతూ కనిపిస్తారట ఆయన. ఇక ఇండస్ట్రీలో ఉన్న తన ఫ్రెండ్స్ కి ఉన్న పెద్ద కార్లను అప్పుడప్పుడు ఆయన తీసుకొని ఊరికి వెళ్తూ ఉంటారట. ఇలా ఇండస్ట్రీలో అడపదడప గుర్తింపు సంపాదించుకున్న సంపూర్ణేష్ కు పెద్దగా ఆస్తులు మాత్రం లేవు అన్నది తెలుస్తుంది. అయినప్పటికీ ఇక ఎప్పుడు విరాళాలు ప్రకటిస్తూ మంచి మనసును చాటుకుంటూ ఉంటాడు సంపూర్ణేష్ బాబు.