ఈగల్ సినిమా నుంచి టీజర్ వచ్చేది అప్పుడే..!!
ఈ సినిమా ప్రమోషన్స్ ను కూడా చిత్ర బృందం మొదలుపెట్టడానికి సిద్ధమయ్యింది. ఈ క్రమంలోనే ఈ చిత్రం నుంచి టీజర్ ని విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్రబృందం. గతంలో ఈ సినిమా అనౌన్స్మెంట్ చేస్తూ ఒక రిలీజ్ చేసిన వీడియో అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా సస్పెన్స్ చిత్రాలుగా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈగల్ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నామని తెలిసి ఎలాంటి హైప్ ని క్రియేట్ చేస్తారో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకుడుగా మొదటిసారి ఈ సినిమాని తెరకెక్కిస్తూ ఉన్నారు.
కార్తికేయ-2 చిత్రంతో పాటు రవితేజ సినిమా ధమాకా డిస్కో రాజా చిత్రాలకు కూడా కార్తీక్ డిఓపిగా పనిచేయడం జరిగిందట. ఈ సినిమాలో రవితేజ కి జంటగా అనుపమ పరమేశ్వరన్, కావ్య దాపర హీరోయిన్స్ గా నటిస్తూ ఉన్నారు. అలాగే నవదీప్ వినయ్ రామ్ కూడా ఇందులో కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజున ఉదయం 10:44 నిమిషాలకు ఈ సినిమా టీజర్ ని సైతం విడుదల చేయబోతున్నట్లు తెలియజేసింది చిత్ర బృందం. మరి ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.