'స్పై' సినిమా ఫ్లాప్ కి.. కారణం అదే.. నిఖిల్ షాకింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా కొనసాగుతున్న నిఖిల్.. ఇక తన సినిమాలు విషయంలో ఎంతో జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. అందరిలా కమర్షియల్ హంగుల జోలికి పోకుండా కథలో బలం ఉన్న స్టోరీలను మాత్రమే ఎంచుకుంటూ సూపర్ హిట్లను సాధిస్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అని చెప్పాలి.


 ఇక నిఖిల్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతూ ఉండడం గమనార్హం. కార్తికేయ 2తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నిఖిల్.. ఇప్పుడు వచ్చిన క్రేజ్ ని కాపాడుకునే విధంగా జాగ్రత్తగా సినిమాలు చేస్తూ ఉన్నాడు. అయితే కార్తికేయ 2 తర్వాత భారీ అంచనాల మధ్య వచ్చిన నిఖిల్ మూవీస్ స్పై. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కార్తికేయ 2,  18 పేజెస్ సినిమా లాంటి సక్సెస్ తర్వాత వచ్చిన ఈ మూవీ కార్తికేయ కెరియర్ కు ఒక మచ్చలా మిగిలింది.



 అయితే ఈ సినిమా పరాభవం పట్ల అప్పట్లో నిఖిల్ తన అభిమానులందరికీ కూడా ఒక సారి నోట్ కూడా విడుదల చేశాడు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల స్పై సినిమా ఫ్లాప్ గురించి నిఖిల్ స్పందించాడు. ఈ మూవీ ఎందుకు డిజాస్టర్ గా నిలిచిందో చెప్పే ప్రయత్నం చేసాడు. వాస్తవానికి ఈ సినిమాకి సంబంధించి ఇంకా పది రోజుల షూటింగ్ పెండింగ్లో ఉన్నట్లు చెప్పాడు. అది పూర్తి చేయకుండానే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు హడావిడిగా సినిమా రిలీజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఈ కారణంగానే సినిమా అసంపూర్ణంగా మిగిలిపోయిందని.. దీంతో ప్రేక్షకులకు సినిమా స్టోరీ అర్థం కాక అవస్థలు పడ్డారని.. నిర్మాత తొందరపాటు నిర్ణయం సినిమా ఫ్లాప్ కు కారణమైంది అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: