సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగాలి అంటే అందం నటన ఉంటే సరిపోదు దానికి తగ్గట్టు అదృష్టం కూడా ఉంటేనే హీరోయిన్గా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వగలరు. అందరికీ ఆ అదృష్టం ఉండాలి కానీ ఎదురు చూస్తే తప్పకుండా విషయం అందుతుంది. ఈ విషయాన్ని ప్రూఫ్ చేసింది మీనాక్షి చౌదరి. మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయినప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అనుకున్న రింగ్స్ లో సక్సెస్ సాధించలేకపోయినప్పటికీ ఎంతో కొంత గుర్తింపును అయితే అందుకుంది.
కానీ ఈమెకు ఒక స్టార్ హీరో సరసన నటించే అవకాశం వచ్చినట్లుగా తెలుస్తోంది. దానితోపాటు అంతకు మించిన రెమ్యునరేషన్ సైతం ఈమె అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక అసలు విషయం ఏంటంటే ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది మీనాక్షి చౌదరి .వెబ్ సిరీస్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. గతంలో అడవి శేషు హీరోగా నటించిన హిట్ 2 సినిమాలో నటించి భారీ ఆఫర్లను దక్కించుకుంది. అంతేకాదు కిలాడి సినిమాలో సైతం నటించింది.
ఇచ్చట వాహనములు కిలాడి సినిమాలో వరకు తన రేంజ్ అంతకంత కు పెంచుకుంటూ పోయింది. ఇప్పుడు కూడా అదే జోష్లో ఫుల్ ఫామ్ లో ఉంది. అయితే తాజాగా ఈమె మహేష్ బాబు హీరోగా నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో కూడా హీరోయిన్గా నటించే బంపర్ ఆఫర్ ని తగ్గించుకుంది. లేటెస్ట్గా ఇప్పుడు ఒక తమిళ సినిమాలో కూడా మంచి అవకాశాన్ని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. తలపతి విజయ్ లేటెస్ట్గా లియో సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం తలపతి 68 అనే వర్కింగ్ టైటిల్తో వస్తున్న సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్గా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇక దానికోసం ఈ ముద్దుగుమ్మ మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది..!!