మీరు బ్లూ ఫిలిమ్స్ చూస్తారా.. హీరోయిన్ ఖుష్బూ షాకింగ్ కామెంట్స్?
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రిగా కొనసాగుతున్న రోజను ఉద్దేశిస్తూ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ చేసిన ఆరోపణలు సంచలనగా మారిపోయాయ్. ఏకంగా ఏపీ రాజకీయాలను ఊపేసాయి. రోజాపై ఆరోపణలు చేస్తూ బ్లూ ఫిలిమ్స్ అనే పదాన్ని ఉపయోగించడంతో ఇక మహిళ రాజకీయ నాయకులు తీవ్రంగా ఖండించారు అని చెప్పాలి. ఒక మహిళ నాయకురాలిపై ఇలాంటి ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు అని ఎంతోమంది రోజా స్నేహితులకు కూడా ఖండించారు. ఇక ఇప్పటికే సీనియర్ నటి కుష్బూ ఈ విషయాన్ని ఖండించిన విషయం తెలిసిందే.
అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో కూడా ఖుష్బూ ఈ విషయంపై మాట్లాడారు. బ్లూ ఫిలిమ్స్ మీ దగ్గర ఉండి ఉంటే.. మీరు బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నారు కదా. అందుకే మీకు తెలుసు.. ఆ అమ్మాయి బ్లూ ఫిలిమ్స్ లో యాక్ట్ చేసింది అని. అది ఎవరు మాట్లాడటం లేదే. అవును నేను బ్లూ ఫిలిమ్స్ చూస్తున్నాను. అందుకే రోజాను అందులో చూశాను అని ఆయన చెప్పమని చెప్పండి. దీన్ని బట్టి మీరు బ్లూ ఫిలిమ్స్ చూస్తారు.. పోర్న్ చూస్తారు. కానీ ఒక మహిళ గురించి దిగజారి ఎలా మాట్లాడుతారు అని నాకు అసలు అర్థం కావట్లేదు. అది ఒక పురుషుడిగా మీలోని భయాలను ఓటమిని చూపిస్తుంది. పురుషుడిగా మాత్రమే కాదు మనిషిగా కూడా మీరు ఓడిపోయారు. అదే నేను ఖండిస్తున్నాను అంటూ కుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు.