హేమలత లవణం పాత్రలో పవర్ స్టార్ మాజీ భార్య...!!
టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాలో చాలా వరకు నిజ జీవిత కథ ఆధారంగానే కొన్ని పాత్రలను రూపొందించారు. ఈ క్రమంలోనే హేమలత లవణం పాత్ర కూడా నిజ జీవిత కథ ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పాలి. లెజెండరీ రచయిత 'గుర్రం జాషువా' కూతురే 'హేమలత లవణం'.ఈమె ఒక సంఘసంస్కర్త, అలాగే తండ్రిలా ఒక రచయిత. ఈమె జాతి వివక్షత అంటరానితనం వంటి వాటిపై కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేశారు. 19వ కాలంలో తన భర్తతో కలిసి హేమలత.. నేరాలకు పాల్పడే నేరస్థుల్లో పరివర్తన తీసుకు వచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈక్రమంలోనే స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావుని కూడా ఆమె కలుసుకున్నారని ఈ సన్నివేశాలను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇలా ఈ సినిమా ద్వారా రేణు దేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈమె పాత్ర పై కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి. మరి టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రవితేజ ఎలాంటి సక్సెస్ అందుకుంటారు హేమలత లవణం పాత్రలో నటించిన రేణు దేశాయ్ ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారు అనే విషయం తెలియాల్సి ఉంది.