గుంటూరు కారం: మహేష్ తో వార్.. వారికే రిస్క్?

Purushottham Vinay
సంక్రాంతి  సీజన్  సినిమాలకి కేరాఫ్ అడ్రెస్. ఈ సీజన్ లో వచ్చినన్ని సినిమాలు, పోటీ పడే స్టార్లు ఇంకో సీజన్ లో కనీసం కనిపించను కూడా కనిపించరు. ఇక ఎప్పటిలాగే ఈసారి కూడా 2024 సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ బరిలో ఉన్నాయి.ఈ ఫెస్టివల్ సీజన్ ని క్యాష్ చేసుకోవడానికి హను మాన్, ఈగల్, నా సామీ రంగ, VD 13, లాల్ సలామ్, అయలాన్ ఇంకా సైంధవ్ సినిమాలు థియేటర్స్ లోకి రానున్నాయి. తమ సినిమాకి డబ్బులు రావాలని పైగా సంక్రాంతి పండగ అంటే విద్యార్థులకు ఎక్కువ రోజులు సెలవలు వస్తాయి అని అలోచించి సంక్రాంతికి సినిమాలు రిలీజ్ చేయడంలో ఎలాంటి తప్పులేదు కానీ ఈ రేసులో బాక్స్ ఆఫీస్ కింగ్ సూపర్ స్టార్ మహేష్‌ బాబు ఉన్నాడనే విషయాన్ని మరిచిపోతున్నట్టున్నారు. మహేష్ బాబు యావరేజ్ రేటింగ్ సినిమాలే రికార్డు వసూళ్లు నమోదు చేస్తాయి. అలాంటిది టాప్ డైరెక్టర్లో ఒకడైన త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో మంచి మాస్ మూవీ పడితే ఇంకెన్ని రికార్డులు నమోదవుతాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.



గుంటూరు కారం  సాంగ్స్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తుంది, మహేష్ ఈ మధ్య కాలంలో చూడనంత మాస్ గా ఈ మూవీలో కనిపిస్తాడు, రాజమౌళి సినిమాల రేంజులో కలెక్షన్స్ ఉంటాయి, సంక్రాంతికి ఎట్టి పరిస్థితుల్లో వస్తున్నాం అంటూ గుంటూరు కారం సినిమాపై అంచనాలు పెంచేశాడు నిర్మాత నాగ వంశీ. ఇక టీజర్, ట్రైలర్, సాంగ్స్ కూడా బయటకి వస్తే గుంటూరు కారం సినిమాపై అంచనాలు ఖచ్చితంగా ఆకాశాన్ని తాకే రేంజులో ఉంటాయి. ఇక జనవరి 12న రిలీజ్ కానున్న గుంటూరు కారం సినిమానే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్స్ ని సగానికి పైగా సొంతం చేసుకోవడం గ్యారెంటీ. కాబట్టి 2024 సంక్రాంతికి మహేష్ బాబు ఒక్కడు వన్ సైడ్… మిగతా హీరోలంతా ఒక సైడ్ అనేలా బాక్సాఫీస్ వార్ అనేది జరగనుంది. అన్ని సినిమాలు కూడా సూపర్ స్టార్ మహేష్‌ సినిమాతోనే పోటీ పడుతున్నాయి. నాగ్ నా సామి రంగ, వెంకీ సైందవ్, చైల్డ్ ఆర్టిస్ట్ తేజ సజ్జ హనుమాన్, విజయ్ దేవరకొండ 13 వ సినిమా ఇంకా తమిళ డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. అయితే ఎన్ని సినిమాలు వచ్చిన మహేష్ బాబు గుంటూరు కారం సునామిలో కొట్టుకుపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: