అల్లు అర్జున్... త్రివిక్రమ్ మూవీ ఇప్పట్లో లేనట్లేనా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత క్రేజ్ కలిగిన కాంబినేషన్ లో అల్లు అర్జున్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ఒకటి. వీరి కాంబినేషన్ లో మొదటగా జులాయి మూవీ రూపొందింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. అలాగే భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో సన్నాఫ్ సత్యమూర్తి అనే మూవీ రూపొందింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఇక ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో అలా వైకుంఠపురంలో అనే సినిమా కూడా రూపొందింది. ఇకపోతే ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీ తో వీరి కాంబినేషన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ కూడా పెరిగిపోయింది. ఇది ఇలా ఉంటే వీరి కాంబినేషన్ లో నాలుగవ మూవీ కూడా రూపొందబోతుంది అని చాలా రోజులు వార్తలు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఆ వార్తలకు అనుగుణంగానే వీరి కాంబినేషన్ లో మరికొన్ని రోజుల్లోనే ఓ మూవీ స్టార్ట్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా విలువడింది. ఆ తర్వాత ఈ మూవీ పాన్ ఇండియా మూవీ గా రూపొందినట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్న అల్లు అర్జున్ ఆ మూవీ పూర్తి కాగానే త్రివిక్రమ్ సినిమాలో జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇకపోతే తాజాగా అల్లు అర్జున్ , అట్లీ తో ముందుగా ఓ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా తో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కానీ మూవీ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దానితో అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబోలో మూవీ రూపొందడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: