నాకు "స్కంద" సినిమా విషయంలో ఎలాంటి నర్వస్ లేదు... బోయపాటి శ్రీను..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి బోయపాటి శ్రీను గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన భద్ర మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను , సూపర్ క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ఈయన ఇప్పటి వరకు అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా వరకు మూవీ లు విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవడంతో ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా ఈ దర్శకుడు కెరియర్ ను కొనసాగిస్తున్నాడు.

ఇకపోతే ఆఖరిగా బోయపాటి , బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ మూవీ ని రూపొందించాడు. ఈ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇకపోతే తాజాగా ఈ దర్శకుడు రామ్ పోతినేని హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా స్కంద అనే మూవీ ని తెరకెక్కించాడు  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ వారు నిర్మించిన ఈ సినిమాకి తమన్ సంగీతం అందించగా ... శ్రీకాంత్  , ప్రిన్స్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమాని సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ మూవీ విడుదల తేదీ పడడంతో ఈ చిత్ర బృందం తాజాగా ఈ ఈవెంట్ ను నిర్వహించింది. అందులో భాగంగా బోయపాటి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

తాజా ఈవెంట్ లో భాగంగా బోయపాటి ఈ సినిమా విడుదల దగ్గర పడింది మీకు నర్వస్ గా లేదా అని అడుగుతున్నారు ... నాకు అస్సలు నార్వస్ గా లేదు. ఎందుకంటే సినిమా తీసేటప్పుడు కష్టపడతాం ... ఎన్ని అవాంతరాలు అడ్డయిన వాటిని నిలదొక్కుకొని నిలబడతాం. సినిమా పూర్తి అయ్యి ఔట్ పుట్ బయటికి వచ్చాక ఎలాంటి టెన్షన్ ఉండదు. అలాగే ఈ సినిమాకి కూడా టెన్షన్ లేదు. ఎందుకంటే ఈ మూవీ ని సూపర్ గా రూపొందించా అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: