శివాజీ తో గొడవకు దిగిన శోభా శెట్టి.. ఏమైందంటే..?

Divya
బుల్లితెర పై వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షోగా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగులో ఆరు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకొని. ఇప్పుడు ఏడవ సీజన్ ని కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మొదటివారం పూర్తవగా ఇప్పుడు రెండవ వారం కూడా మొదలైంది. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా ఫుల్టా అంటూ సీజన్ పై ఎన్నో అంచనాలు పెంచేశారు నిర్వాహకులు. కానీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోవడం లేదని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా రెండో వారంలో భాగంగా సోమవారం నామినేషన్ ప్రక్రియ మొదలవగా అందులో శోభా శెట్టి , శివాజీ మధ్య గొడవ తారస్థాయికి చేరింది.

నామినేషన్ లో భాగంగా ఒకరికొకరు నామినేట్ చేసుకుంటూ పూర్తిస్థాయిలో గొడవ పడుతున్న నేపథ్యంలో శోభా శెట్టి , శివాజీ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. నన్ను నామినేట్ చేసింది అందుకే నేను ఆమెను నామినేట్ చేస్తున్నాను అంటూ శివాజీ తెలిపాడు. దీంతో కోపగించుకున్న శోభా శెట్టి ఇది వ్యాలిడ్ పాయింట్  కాదు అంటూ శోభా శెట్టి అసహనం వ్యక్తం చేసింది. కొంతమంది టీం గా ఆడుతున్నారని శివాజీ ఆమెను ఉద్దేశించి ఆడారు.అయితే  ఎవరూ జట్టుగా ఆడడం లేదని ఖండించింది. ఇక నేను కూడా ఆర్టిస్టునే అని శోభా శెట్టి ఖండించడంతో అందుకే శివాజీ కాస్త వ్యంగ్యంగా అన్నాడు.

ఇంప్రెస్ చేయడం ఏంటి అని శోభ కోపంగా ప్రశ్నించింది. దానికి శివాజీ పాయింట్ అదే కదా.. గేమ్ లో ఇంప్రెస్ చేసావ్ అన్నాను అంటూ మళ్ళీ కౌంటర్ వేశాడు శివాజీ. ఇలా ఇద్దరు కూడా చాలా సమయం గొడవ పడ్డారు. ఆ తర్వాత మీరు చెబితే నేను హౌస్ నుండి వెళ్లను బిగ్ బాస్ చెబితే హౌస్ నుంచి వెళ్తాను అంటూ గొడవకు ముగింపు పలికింది.  మొత్తానికైతే ఈ ఆసక్తికర విషయాలు తాజాగా విడుదల చేసిన ప్రోమోలో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: