తారక్ ఆ రోజును చచ్చినా మరిచిపోయాడు.. అతనికి అదొక స్పెషల్ డే?
జూనియర్ ఎన్టీఆర్ తన లైఫ్‌లో ఎన్నో మైలురాళ్లను దాటాడు. ఎవరి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోగా ఎదిగాడు. "స్టూడెంట్ నెం.1,” “సింహాద్రి,” “యమదొంగ,” “జనతా గ్యారేజ్”, "ఆర్ఆర్ఆర్" వంటి బ్లాక్ బస్టర్ హిట్స్‌తో పాన్ ఇండియా నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్నాడు. ఇదంతా కేవలం స్వయంకృషితోనే అతనికి ఇది సాధ్యమైంది. ఈ నందమూరి హీరో పర్సనల్ లైఫ్ లో కూడా సక్సెస్ అయ్యాడు. గుణవంతురాలైన భార్య, చందమామ లాంటి ఇద్దరు మగ పిల్లలతో తారక్ మంచి ఫ్యామిలీ లైఫ్ గడుపుతున్నాడు.
అయితే ఈ హీరోకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అలాగే కొన్ని డేట్స్ అంటే తారక్ బాగా ఇష్టం. ముఖ్యంగా మార్చి 26 అంటే తారక్‌కు ఎంతో ఇష్టం. ఆరోజు ను అతడు చచ్చినా మర్చిపోడు. ప్రతి మార్చి 26వ తేదీన 2 కేక్స్ కూడా తారక్ ఇంట్లో కట్ చేస్తారు. ఇంతకీ అదేదో జూ.ఎన్టీఆర్ పుట్టినరోజు అని, లేదంటే పెళ్లి రోజు అని అనుకుంటే పొరపాటే. అది అతను చావుల అంచు వరకు వెళ్లిన భయానక రోజు. అయితే ఈ రోజు తనకు ఎంతో అదృష్టం ఉండబట్టే బతకగలిగానని తారక్ నమ్ముతాడు. తనకు పునర్జన్మ అందించింది అదే రోజు అని భావిస్తాడు. ఆసక్తికర అంశం ఏమిటంటే, అదే రోజు తారక్ భార్య పుట్టిన రోజు. అందుకే జూనియర్ ఎన్టీఆర్ మార్చి 26వ తేదీని తన జీవితంలో ఒక స్పెషల్ డే గా భావిస్తాడు. దానిని ఎప్పటికీ మర్చిపోడు
ఇంతకీ చావు అంచుల వరకు వెళ్లిన ఆరోజు ఏం జరిగిందో తెలుసుకుంటే.. దాదాపు 14 ఏళ్ల కిందట అంటే 2009లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఖమ్మం వెళ్ళాడు. అనంతరం హైదరాబాద్ కు తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తారకు తల, భుజం, మోచేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టం కొద్దీ తారక్ ఈ గాయాల నుంచి ప్రాణాలతో బయటపడగలిగాడు. ఆ యాక్సిడెంట్ కారణంగా అభిమానులు ఎంతో విలవిల్లాడారు. అయితే మార్చి 26 తేదీని తాను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని ఎన్టీఆర్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన క్లిప్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది.