ఏంటి.. షారుక్ ఖాన్ జవాన్ మూవీ.. సత్యరాజ్ సినిమాకు కాపీనా?
ఇప్పటి ప్రేక్షకులు సత్యరాజ్ కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే చూస్తున్నారు. కానీ ఒకప్పుడు మాత్రం సత్యరాజ్ ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగాడు అని చెప్పాలి. బ్రహ్మ, ఎం ధర్మరాజు ఎంఏ, ఎస్పీ పరశురాం లాంటి ఒరిజినల్ వర్షన్ లో సత్యరాజ్ కథానాయకుడు కావడం గమనార్హం. అయితే సత్యరాజ్ హీరో అయి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆయన గురించి ఎందుకు అనుకుంటారు కదా ఇప్పుడు షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా విడుదలైన తర్వాత ఈ విషయం చర్చకు వచ్చింది. జవాన్ దర్శకుడు అట్లీ పాత సినిమాల నుంచి స్ఫూర్తి పొంది తన సినిమాలను తీస్తూ ఉంటాడు. ఇది గత నాలుగైదు సినిమాల నుంచి అందరూ గమనించి ఉంటారు.
ఇక ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన జవాన్ సినిమా సైతం గతంలో కమల్ హాసన్ ఖైదీ వేట నుంచి ఇన్స్పైర్ అయి వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. 1989లో సత్యరాజ్ హీరోగా తాయ్ నాడు అనే మూవీ రిలీజ్ అయింది. రాధిక హీరోయిన్. నిజాయితీ కలిగిన ఒక మిలిటరీ ఆఫీసర్ ను అన్యాయంగా కేసులో ఇరికించి శత్రువులకు సహకారం అందించాడన్న అభియోగం వేసి అవమానం చేస్తారు. నిజం బయటికి రాకుండా చంపేస్తారు ఆత్మహత్యగా కూడా చిత్రీకరిస్తారు. కుటుంబం అనుమానం పాలవుతుంది. కానీ కొడుకు పెరిగి పెద్దవాడై తండ్రిని ఈ స్థితికి తీసుకొచ్చిన వాళ్లను పట్టుకుని ప్రతీకారం తీర్చుకుంటాడు. ఈ రెండు పాత్రల్లో కూడా సత్యరాజ్ డ్యూయల్ రోల్ పోషించాడు. అయితే జవాన్ లో తండ్రిని బతికించి.. అతని స్థానంలో దీపిక పదుకొనేను ఉరివేయిస్తారు. ఇది ఒకటే తేడా ఇక మిగతాదంతా సత్యరాజ్ మూవీ లాగానే మక్కికి మక్కి ఉంది అని అందరూ చర్చించుకుంటున్నారు