జవాన్ లో షారుఖ్ కు.. డూప్ గా నటించిన వ్యక్తి ఎవరో తెలుసా?
అయితే ఇక ఈ సినిమాలో షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశాడు. ఇక మాస్ ప్రేక్షకులందరికీ పూనకాలు తెప్పిస్తున్న ఈ సినిమా థియేటర్ల వసూళ్లలో దూసుకుపోతుంది. కేవలం రెండు రోజుల్లోనే 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ మూవీ ఇక పఠాన్ సినిమాలాగే దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించేలాగే కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో ఉన్న ద్విపత్రాభినయంలో రెండు పాత్రలోనూ షారుఖ్ ఖాన్ నటించాడు అందరూ అనుకున్నారు. కానీ కొన్ని సీన్స్ లో దూప్ యాక్ట్ చేశాడట. షారుఖాన్కి డూప్ గా యాక్టింగ్ చేసింది ఎవరు? అతనికి ఎంత రెమ్మనరేషన్ ఇచ్చారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.
కేవలం జవాన్ మాత్రమే కాదు గత 15 ఏళ్ల నుంచి షారుక్ ఖాన్ కి డూప్ గా ఆ వ్యక్తి నటిస్తున్నాడట. అతని పేరు ప్రశాంత్ వాడ్లే. ఇతను షారుక్ ఖాన్ కి డూప్ గా నటిస్తున్నప్పటికీ.. రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గాను సత్తా చాటుతూ ఉన్నాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొని జవాన్ సినిమా విశేషాలను బయటపెట్టాడు జవాన్ సినిమాలో ఒకేరోజు రెండు గెటప్స్ తో షూటింగ్ ఉంది. ఆ సమయంలో షారుక్ కొడుకు గెటప్ వేస్తే నేను తండ్రి గెటప్ వేసాను. నన్ను కౌగిలించుకునే టైంలో ఆయన క్లోజప్ షాట్స్ తీశారు. ఆ తర్వాత నేను కొడుకు గెటప్ చేస్తే ఆయన తండ్రి గెటప్ చేయగా సీన్స్ తీశారు అంటూ ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. అయితే ఇలా షారుక్ డూప్ గా నటిస్తున్న ప్రశాంత్ కి రోజుకి 30,000 ఇస్తున్నారు. అంటే నెలకు 9 లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పాలి.