సూపర్ స్టార్ సినిమాలో రానా..!

shami
జైలర్ హిట్ తో సూపర్ ఫాం లోకి వచ్చిన సూపర్ స్టార్ రజిని తన నెక్స్ట్ సినిమా లైన్ లో పెట్టబోతున్నారు. ఆల్రెడీ రజిని కూతురు ఐశ్వర్య రజినికాంత్ డైరెక్షన్ లో లాల్ సలాం సినిమా చేస్తున్న రజిని ఆ తర్వాత జై భీమ్ ఫేమ్ టీజే జ్ఞానవెల్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నారని తెలుస్తుంది. సూర్య హీరోగా వచ్చిన జై భీమ్ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సూర్య తో పాటుగా ఆ సినిమాలో నటించిన వారంతా కూడా బాగా సపోర్ట్ చేశారు.
అయితే టీజే జ్ఞానవెల్ జై భీం తర్వాత మరో అద్భుతమైన కథతో వస్తున్నారని తెలుస్తుంది. రజిని ఇమేజ్ తగినట్టుగానే ఉంటూ సామాజిక నేపథ్యంతో ఈ సినిమా కథ ఉంటుందని టాక్. ఈ సినిమాలో రజిని తో టాలీవుడ్ హీరో హ్యాండ్సం హంక్ రానా దగ్గుబాటి కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాడని టాక్. అయితే రజిని హీరో అనగానే రానా విలన్ అనే ఫిక్స్ అవుతారు. కానీ ఈ సినిమాలో రానా ఇంపార్టెంట్ రోల్ హీరో తర్వాత హీరో అంత రోల్ అని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో మంజిమా మోహన్ కూడా నటిస్తుంది. జై భీమ్ తరహాలోనే బలమైన కథతో రజిని స్టామినాకు తగినట్టుగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాడట జ్ఞానవెల్. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్ లో రిలీజ్ ఉంటుందని టాక్. జ్ఞానవెల్ జై భీమ్ సినిమా తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. రజిని రానా ఇద్దరు కలిసి చేసే ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజీ ప్రాజెక్ట్ గా రాబోతుంది. ఈ సినిమా విషయంలో రానా కన్ఫర్మేషన్ త్వరలో బయటకు వస్తుందని టాక్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: