ప్రకటించిన తేదికే మెగాస్టార్ 'విశ్వంభర' ఆగమనం..!!

murali krishna
మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ట ‘విశ్వంభర’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తోంది. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పై వచ్చే ఫ్లాష్ బ్యాక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని.. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లోని విజువల్స్ ఆదరిపోతాయని, అలాగే.. మెగాస్టార్ పాత్ర చాలా విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.అన్నట్టు రీసెంట్ గా ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ సినిమాలో మెగాస్టార్ ను ఎలా చూడాలి అనుకుంటున్నారో.. ఆయన పాత్ర అలాగే ఉంటుంది అని, దానితో పాటుగా అద్భుతమైన ఫాంటసీ డ్రామా కూడా ఉంటుంది అని వశిష్ట చెప్పుకొచ్చాడు. UV క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ విశ్వంభర సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు.
 చిరంజీవి గత చిత్రాల ఫలితాల నేపథ్యంలో అప్పటికే కమిట్‌ అయిన ఒకటి రెండు సినిమాలను పక్కన పెట్టి చేస్తున్న చిత్రం 'విశ్వంభర'. ఇలాంటి సమయంలో విశ్వంభర వంటి సినిమా ను చేయడం చాలా అవసరం అని భావించి వశిష్ట చెప్పిన కథకు వెంటనే చిరంజీవి ఓకే చెప్పడం జరిగిందట. 

త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ కథాంశంతో దర్శకుడు వశిష్ట రూపొందిస్తున్నాడు. బింబిసార సినిమా ను సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడం తో పాటు, కమర్షియల్ విజయాన్ని సొంతం చేసుకున్న వశిష్ట మరోసారి సోషియో ఫాంటసీ కాన్సెప్ట్‌ తో రాబోతున్నాడు.
విశ్వంభర' సినిమా ప్రకటించిన సమయంలోనే 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. సంక్రాంతి రిలీజ్ కు అనుగుణంగానే షూటింగ్‌ ను దర్శకుడు పూర్తి చేసే పనిలో ఉన్నాడు. అక్టోబర్ లో లేదా నవంబర్‌ లో సినిమా షూటింగ్‌ పూర్తి చేసి గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి. ఒక వైపు షూటింగ్‌ తో బిజీ బిజీగా ఉన్నా దసరాకు మెగా ఫ్యాన్స్ కి పండుగ స్పెషల్‌ గా ఏమైనా కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో విశ్వంభర టీజర్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఒక పోస్టర్ ను విడుదల చేయాలని భావించినా దసరాకి టీజర్ వస్తే బాగుంటుందని మెగా కాంపౌండ్ నిర్ణయించిందట.ఇదిలావుండగా విశ్వంభరా సినిమా విడుదల తేదీలో మార్పులు ఉంటాయని వస్తున్న వార్తలపై డైరెక్టర్ వశిష్ట క్లారిటీ ఇచ్చారు.10-1-2025 విజృంభణం విశ్వంభర ఆగమనం అని పోస్ట్ చేశారు దీంతో విశ్వంభర సంక్రాంతికి రిలీజ్ అవ్వనుంది. అయితే మూవీ టీజర్ అయిన రిలీజ్ చేయాలని ఫాన్స్ కామెంట్ చేస్తున్నారు. మూడు నెలలు కూడా లేదని అప్డేట్స్ ఇస్తూ మూవీ పై ఆసక్తి పెంచాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: