వామ్మో.. కిలో బియ్యం రూ.15 వేలా?
నేటి రోజుల్లో పేద మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే సన్నబియ్యం అయితే క్వింటాల్ కి ఐదు నుంచి 6000 రూపాయలు మార్కెట్లో పలుకుతూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము. కానీ బియ్యం కేవలం కిలోనే 15వేల రూపాయలు ఉండడం ఎప్పుడైనా వినడం గాని చూడటం గాని చేశారా.. కిలో పదిహేను వేల రూపాయలా.. అలాంటి బియ్యం ఉన్నాయి అన్న విషయం కూడా మాకు ఇప్పటి వరకు తెలియదు అని సమాధానం చెబుతారు ఎవరైనా. అయితే ఇంకొంతమంది ఇది అబద్ధం అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుకోబోయేది కాస్లీ రైస్ గురించి.
అత్యంత ఖరీదైన బియ్యాన్ని జపనీయులు పండిస్తున్నారు అన్న విషయం చాలామందికి తెలియదు. అయితే జపనీస్ కిన్మేమై రైస్ కిలో ఏకంగా 15000 రూపాయలు. ఇది వినడానికి నమ్మశక్యంగా లేకపోయినప్పటికీ ముమ్మాటికి నిజమే పేటెంట్ పొందిన కిన్మే మై ప్రత్యేకమైన పద్ధతిని ఉపయోగించి దీనిని పండిస్తూ ఉంటారట. అయితే ఈ బియ్యంలో ఉన్నతమైన రుచి పోషక విలువలు ఎక్కువగా ఉంటాయట. కాగా జపనీలు ఇక ఈ బియ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తూ ఉండడం గమనార్హం. ఏది ఏమైనా అటు కిలో పదిహేను వేల రూపాయలు అంటే నిజంగా అవాక్కయ్యే విషయమే కదా.