ఇంట్లో ఫ్రిడ్జ్ వల్ల.. మహిళలకు ఆ సమస్యలు వస్తాయా.. వామ్మో?
కూరగాయలు సహా ఎన్నో రకాల పదార్థాలను రిఫ్రిజిరేటర్ లో భద్రంగా ఉంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఇక ఎక్కువ కాలం పాటు అవి ఎంతో తాజాగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే నేటి రోజుల్లో ఇలా రిఫ్రిజిరేటర్ లేని ఇల్లు లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. పేద మధ్యతరగతి ప్రజల సైతం తమ తాహకుతకు తగ్గట్లుగా ఫ్రిడ్జ్ తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం చూస్తూ ఉన్నాం. అయితే ఫ్రిడ్జ్ తెచ్చుకున్న తర్వాత కొంతమంది ఆ ఫ్రిడ్జ్ ని క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా రోగాలను కొనితెచ్చుకున్నట్లే అని చెబుతున్నారు నిపుణులు.
అయితే ఇలా ఫ్రిడ్జ్ క్లీన్ చేయకపోవడం వల్ల మహిళల్లో యూరినరీ సమస్యలు వస్తాయని ఇటీవల నిర్వహించిన ఒక అధ్యయనంలో బయటపడింది. కుళ్ళిన మాంసాన్ని ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల ఎస్చచిరియా కొలై అనే బ్యాక్టీరియా ఏర్పడి.. అది ఇతర పదార్థాలకు వ్యాపించే ప్రమాదం ఉంది అంటూ ఇటీవలే యూఎస్ అధ్యయనంలో వెళ్ళడైంది. దీంతో దీంతో మహిళల్లో యూరినరీ సమస్యలు వస్తున్నట్లు అంచనా వేసింది. ఇంట్లోని ఫ్రీజ్ ను తరచూ శుభ్రం చేయడం మహిళల ఆరోగ్యానికి ఎంతో మంచిది అంటూ హెచ్చరిస్తూ ఉన్నారు అని చెప్పాలి.