ఆ చిన్న కారణంతో.. బన్నీ - సాయి పల్లవి కాంబో మిస్ అయిందట తెలుసా?
వీరిద్దరూ తమ డాన్సులతో ఎంతలా స్టార్ స్టేటస్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన డాన్సులతో స్టైలిష్ స్టార్ గా అల్లు అర్జున్ పేరు తెచ్చుకుంటే.. ఇక సాయి పల్లవి హీరోయిన్లలో డాన్సులు విషయంలో తన కంటే తోపు ఇంకెవరూ లేరు అని నిరూపించుకుంది అయితే వీరిద్దరి కాంబోలో ఒక సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకున్నారు. అలాంటి పెద్ద సాహసమే చేయాలని అనుకున్నాడట అల్లు అర్జున్ కి బాగా అచ్చొచ్చిన డైరెక్టర్ సుకుమార్. పుష్ప సినిమాలో శ్రీవల్లి పాత్ర కోసం రష్మికకు బదులు ముందుగా సాయి పల్లవిని అనుకున్నాడట.
అప్పటికే లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవికి ఒక ట్యాగ్ ఇచ్చిన సుకుమార్ ఇక ఆమెను తమ సినిమాలో పెట్టుకుంటే ఇక తిరుగు ఉండదు అని భావించాడట. అయితే సినిమాలో ఇది చాలా మాస్ రోల్ కావడం.. పైగా మొదటి నుంచి సాయి పల్లవికి కొంచెం రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి నో చెప్పడం చూస్తూనే ఉన్నాము. దీంతో ఇక ఈ సినిమాల్లో కొన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి.. కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటాయి. ఈ సీన్స్ నచ్చకనే ఈ సినిమాను సాయి పల్లవి రిజెక్ట్ చేసిందని అప్పట్లో రూమర్లు కూడా వినిపించాయి. ఇలా ప్రేక్షకులు ఊహించిన క్రేజీ కాంబో చిన్న కారణంతో మిస్ అయింది అని చెప్పాలి.