అయ్యో పాపం.. బ్యాలెన్స్ తప్పిన కియారా.. కొద్దిలో కింద పడేది?

praveen
సినిమా హీరోయిన్స్ ఎక్కడికి వెళ్లినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే స్పెషల్ గా కాస్ట్యూమ్స్ ప్లాన్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. కాస్ట్యూమ్స్ మాత్రమే కాదు వాటికి సరిపడా అన్ని రకాల వస్తువులను సెలెక్ట్ చేసుకోవడం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా హీరోయిన్ హై హిల్స్ వేసుకోవడం సర్వసాధారణం అనే విషయం తెలిసిందే.

 అయితే కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లు కాస్ట్యూమ్స్ లేదా ధరించిన  చెప్పులు లాంటి వాటి వల్ల కొన్ని సార్లు ఇబ్బంది పడటం కూడా చూస్తూ ఉంటాం. ఇక ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి  వీడియోనే ఒకటి ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కియారా అద్వాని హై హిల్స్ వేసుకొని తెగ ఇబ్బంది పడింది. ఏకంగా కింద పడబోయింది ఈ హీరోయిన్. కియారా అద్వానీ, కరీనాకపూర్ ఖాన్  ఇటీవలే ముంబై రిటైల్ బ్యూటీ ప్లాట్ ఫారంలు ప్రారంభించారు.  అర్జున్ కపూర్ తో కలిసి ఈవెంట్ కు హాజరయ్యారు.

 ఈ ఈవెంట్ కి ఒక స్పెషల్ డ్రెస్ వేసు కొని వచ్చింది కియారా. స్టేజ్ మీద మాట్లాడుతున్న సమయంలో హై హీల్స్ దుస్తువులలో ఇరుక్కుపోవడంతో చివరికి పడి పోయినంత పని చేసింది. తన వెనకాలే కూర్చున్న కరీనా కపూర్  మీద పడిపోబోయింది కియారా అద్వాని. కానీ అంతలోనే అర్జున్ ఆమెను రక్షించాడు. ఈ సంఘటనతో కుర్చీలో కూర్చున్న కరీనాకపూర్ ఇక స్టేజ్ పై ఆమె ముందు నిలబడిన కియారా ఒక్కసారిగా భయపడి పోయారు అని చెప్పాలి. వీడియో చూసి అలవాటు లేనప్పుడు కొత్త రకం చెప్పులు వేసుకోవడం ఎందుకని కొంతమంది నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: