ఏంటి.. జగపతిబాబు అమ్మాయి ప్రేమ కోసం సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా?
కానీ అప్పుడు స్టార్ హీరోగా మాత్రం ఎదగలేకపోయాడు. కానీ చాలా ఏళ్ల తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి విలన్ గా అదరగొట్టాడు అని చెప్పాలి. ఇప్పుడు విలన్ గా ఏకంగా హీరో హీరోలకు తండ్రి పాత్రల్లో కూడా నటిస్తూ తన నటనతో ఆకట్టుకుంటున్నాడు. ఇక ఇలా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీబిజీగా మారాడు. ఇదంతా పక్కన పెడితే జగపతిబాబు ఏకంగా ఒకానొక సమయంలో ఒక అమ్మాయి కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడట. జగపతిబాబు తండ్రి నిర్మాత విబిఆర్ ప్రసాద్ ముందుగా జగపతిబాబును సినిమాల్లోకి కాకుండా వైజాగ్ లో ఉన్న తన ఫర్నిచర్ షాప్ చూసుకోవాలని బాధ్యత అప్పగించాడట.
ఇక ఆ సమయంలో జగపతిబాబుకు చెడు స్నేహాలు ఎక్కువై మద్యానికి కూడా బానిసగా మారిపోయాడట. అక్కడే ఉండే లక్ష్మీ అనే అమ్మాయిని మొదటి చూపులోనే ప్రేమించాడట జగపతిబాబు. లక్ష్మీ కూడా జగపతి బాబుని లవ్ చేసిందట. ఇక ఈ విషయం ఇంట్లో తెలియడంతో పెద్ద గొడవ జరిగిందట. జగపతిబాబు మందుకు బానిసగా మారాడు అనే విషయం తెలిసి లక్ష్మీని అతనికి ఇవ్వడానికి ఆ అమ్మాయి తల్లిదండ్రులకు కూడా ఒప్పుకోలేదు. దీంతో ప్రియురాలు దూరమవుతుందని బాధతో బాగా తాగి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడట. కానీ చివరికి కింద పడి దెబ్బలు తగిలి ప్రాణాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న జగపతిబాబు ఫ్యామిలీ ఇక చివరికి లక్ష్మి కుటుంబాన్ని ఒప్పించగా చివరికి 1988లో జగపతిబాబు లక్ష్మీ ల పెళ్లి జరిగింది.