అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం.. ముందు సుమన్ ను అనుకోలేదట తెలుసా?
కానీ అన్నమయ్య సినిమా చూసిన తర్వాత మాత్రం నాగార్జున కంటే ఆ పాత్రను ఇంకెవరు అంత బాగా పోషించలేరు అని అందరూ నమ్మారు. ఇక అప్పట్లో విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది. ఇక ఈ సినిమాకు రెండు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి అని చెప్పాలి. అయితే ఈ సినిమాలో అటు నాగార్జునది ఎంతటి కీలకమైన పాత్రో.. అటు శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన సుమన్ ది కూడా అంతే కీలకమైన పాత్ర. ఇక నిజంగా వెంకటేశ్వర స్వామి దిగి వచ్చాడేమో అనేంతలా పాత్రలో ఒదిగిపోయాడు నటుడు సుమన్.
అయితే అన్నమయ్య సినిమాలో ముందుగా వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం సుమన్ ని అనుకోలేదట. ఈ పాత్రలో సీనియర్ హీరోయిన్ శోభన్ బాబుని పెడితే బాగుంటుంది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు భావించాడట. కానీ అటు శోభన్ బాబుకు మాత్రం పాత్ర చేయడం ఇష్టం లేదు. దీంతో ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగితే వాళ్లే ఊరుకుంటారు అనుకుని భావించి ఆ పాత్ర కోసం 50 లక్షలు అడిగాడట. దీంతో శోభన్ బాబు ను వద్దనుకుని బాలకృష్ణను ఈ పాత్ర కోసం అనుకున్నారట. కానీ ఈ సినిమాలో కొన్నిసార్లు నాగార్జున వెంకటేశ్వర స్వామి పాదాలపై పడే సన్నివేశం ఉంటుంది. ఇక ఈ సన్నివేశంతో అక్కినేని, నందమూరి అభిమానుల మధ్య గొడవ గొడవలు వస్తాయి అని భావించి చివరికి సుమన్ సెలెక్ట్ చేశారట.