ఆ క్రేజీ టాలీవుడ్ డైరెక్టర్ తో.. సినిమాకు రెడీ అయిన సూర్య?
ఇక ఇప్పుడు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీబిజీగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఈ తమిళ స్టార్ హీరో ఇప్పుడూ ఒక టాలీవుడ్ డైరెక్టర్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అని తెలుస్తుంది. ఫాంటసీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందట. అయితే కేవలం సూర్య మాత్రమే కాదండోయ్. ఈ మధ్య కాలంలో తమిళ హీరోలందరూ తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు అటు సూర్య కూడా ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం సూర్య కాంగువ సినిమాతో బిజీగా ఉన్నాడు. తర్వాత సుధా కొంగర దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
ఇప్పటికే ఆకాశమే నీ హద్దురా సూర్య, సుధా కొంగర కాంబినేషన్లో వచ్చి సూపర్ హిట్ సాధించడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలోనే ఒక టాలీవుడ్ డైరెక్టర్ ను కూడా లైన్లో పెట్టేసాడట సూర్య. ఆ డైరెక్టర్ ఎవరో కాదు విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న చందూ మొండేటి. ఇప్పటికే వీరి మధ్య చర్చలు కూడా ముగిసాయట. అయితే సూర్య కోసం చందు మొండేటి ఒక క్రేజీ లైన్ రాసుకున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అన్నది తెలుస్తుంది.