ఆ కారణంగా భార్యపై కోప్పడిన జూనియర్ ఎన్టీఆర్...!!
వరుసపరాజయాలలో ఉన్న ఎన్టీఆర్ ప్రణతితో పెళ్లయ్యాక కెరియర్ పరంగా మంచి ఊపు అందుకున్నారు. ఈ క్రమంలో తన విజయాలలో భార్య ప్రణతి తో చాలాసార్లు సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. ఇక సినిమా చేసిన తర్వాత గ్యాప్ వస్తే భార్య ప్రణతి ఇద్దరు పిల్లలు అభిరామ్, భార్గవరామ్ లతో కలిసి… విహారయాత్రలకు వెళుతూ ఉంటారు. అయితే తారక్ కి మొదటి నుండి కూతురు ఉంటే బాగుంటుందన్న కోరిక ఉండేది. మొదటిసారి కొడుకు పుట్టిన తర్వాత రెండోసారి కూతురు పుడుతుందని ఎన్టీఆర్ చాలా ఆశపడ్డాడట. కానీ రెండోసారి కొడుకు పుట్టడంతో ఆ కోరిక అలాగే ఉండిపోయింది.
ఈ క్రమంలో లక్ష్మీ ప్రణతి మూడో బిడ్డ కోసం ప్లాన్ చేయాలని ఎన్టీఆర్ పై అప్పట్లో ఒత్తిడి తీసుకురావడం జరిగిందట. ఆ రకంగా మూడోసారి ఆడపిల్ల పుడుతుందేమో అని తన భర్త ఎన్టీఆర్ కోరిక నెరవేరుతుందేమో.. అని భావించిందట. కానీ వైద్యులు ఇప్పటికే ఇద్దరు పిల్లలను కన్నారు, మూడోసారి అంటే ప్రణతి ఆరోగ్యం బలహీనమవుతుందని.. చెప్పటం జరిగిందట. అయినా గాని ప్రణతి తొందరగా చేసే రీతిలో వ్యవహరించిన క్రమంలో ఎన్టీఆర్..మొదట నీ ఆరోగ్యం ముఖ్యం. ఇంకేమి ఆలోచించొద్దు అని ఇద్దరు పిల్లలతో సరిపోతుంది అని.. కొద్దిగా ఆగ్రహంగా ప్రణతితో చెప్పి ఒప్పింపా చేయడం జరిగిందట.