దళపతి విజయ్ సినిమాలో ధోని.. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక రైల్వే టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశం గర్వించేందుకు క్రికెటర్ స్థాయికి ఎదిగిన ధోని ప్రస్థానం ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తిదాయకం అని చెప్పాలి. అయితే 2019లోనే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ.. ఇక ధోనీకి ఉన్న క్రేజ్  ఏ మాత్రం తగ్గడం లేదు. అయితే ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి  రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ అటు ఐపిఎల్ ద్వారా మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే ధోని ఇటీవలే కొత్త అవతారం ఎత్తాడు అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారాడు. ఈ క్రమంలోనే ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక బ్యానర్ ను స్థాపించి లెట్స్ గెట్ మ్యారీడ్ అనే ఒక సినిమాను కూడా నిర్మించాడు ధోని. ఇక ఇటీవల ఈ సినిమా విడుదలైంది. అయితే యావరేజ్ టాక్ మాత్రమే సొంతం చేసుకుంది  ఇదిలా ఉంటే ఇక ఇప్పుడు ధోని కి సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అభిమానులందరిలో కూడా మరింత ఆత్రుత పెంచేస్తుంది. ఏకంగా మహేంద్ర సింగ్ ధోని సినిమాల్లో నటించబోతున్నాడట. అది కూడా ఇళయ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న సినిమాలో చేస్తున్నాడట. అంతకుమించిన ఆసక్తికర వార్త ఏంటంటే ఎప్పుడు కూల్ గా కనిపించే ధోని నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్రలో కనిపించబోతున్నాడట.


 తమిళ స్టార్ హీరో విజయ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాకు రెడీ చేశాడు. అయితే ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో టీమిండియా మాజీ కెప్టెన్ ధోని నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా ఈ వార్తతో షాక్ లో మునిగిపోతున్నారు. అయితే గతంలో ధోని విజయ్ దిగిన ఫోటో వైరల్ గా మారిపోతున్నాయి అని చెప్పాలి. అయితే ఇది నిజమైతే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారూ. కానీ ఇది ఎంతవరకు నిజమన్నది అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఎవరికీ తెలియదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: