రామ్ చరణ్.. చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఒకే ఒక్క సినిమా ఏదో తెలుసా?
చరణ్ సినిమాలపై అటు అభిమానుల్లో కూడా భారీ రేంజ్ లోనే అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇలాంటి సమయంలో రాంచరణ్ కు సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. రామ్ చరణ్ ఏకంగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా సినిమాల్లో కనిపించారు. ఈ విషయం ఇప్పటివరకు ఎప్పుడు వినలేదు చూడలేదు కూడా. నిజంగానే చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడా అని షాక్ అవుతున్నారు ఫ్యాన్స్. అయితే రామ్ చరణ్ ఒకే ఒక్క సినిమాలో మాత్రమే బాలుడుగా కనిపించాడట.
అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో కాబట్టి ఇక రాంచరణ్ ను బాల నటుడిగా పరిచయం చేయడానికి ఎంతో మంది దర్శకులు పోటీ పడ్డారట ఇక చరణ్ చిన్నప్పుడు ఎంతో క్యూట్ గా ఉండేవాడట. అందుకే ఇక చివరికి ఓ దర్శకుడు పట్టుబట్టి మరీ చైల్డ్ ఆర్టిస్ట్ గా రామ్ చరణ్ ను సినిమాలో పెట్టుకున్నాడట. అయితే ఈ సినిమా విడుదలైన.. ఎడిటింగ్ టేబుల్ మీద చరణ్ సన్నివేశాలు కట్ చేశారట. చిరంజీవి హీరోగా నటించిన లంకేశ్వరుడు సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక సన్నివేశంలో ఉన్నాడని ట్రేడ్ పండితులు చెబుతూ ఉంటారు. దాసరి నారాయణరావు, చిరంజీవి కాంబినేషన్లో వచ్చిన సినిమాలో చరణ్ నటించాడు. చరణ్ చిరంజీవితో ఉన్న వర్కింగ్ స్టిల్స్ కూడా ఉన్నాయి. అయితే సినిమా అయిపోయిన తర్వాత ఎడిటింగ్ టేబుల్ మీద చూసుకుంటే.. ఆ సన్నివేశం కథకు అతికించినట్లు ఉండడంతో చివరికి దర్శకుడు దాసరి ఆ సీన్ ని తీసేశారట. ఇలా చరణ్ బాలనటుడిగా నటించినప్పటికీ అటు వెండితెరపై మాత్రం కనిపించలేదు అని చెప్పాలి.