మహేష్ బాబుకు ఆ మూవీ ప్లాప్ అవుతుందని ముందే తెలుసా....??

murali krishna
సూపర్ స్టార్ మహేష్ బాబు కథల విషయంలో ఎంతో పర్ఫెక్ట్ గా ఉంటారు. తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ కు మరో ఛాన్స్ ఇవ్వడానికి మహేష్ ముందువరసలో ఉంటారు. మహేష్ బాబు సక్సెస్ రేట్ ఎక్కువే అయినా ఆయన సినీ కెరీర్ లో ఫ్లాప్ సినిమాలు సైతం ఎక్కువగానే ఉన్నాయి.అయితే సినిమా ఫ్లాప్ అవుతుందని తెలిసి కూడా మహేష్ బాబు నటించిన సినిమా బ్రహ్మోత్సవం సని సమాచారం.

ఈ సినిమా షూటింగ్ సగం పూర్తైన తర్వాత మహేష్ బాబు కు ఈ సినిమా రిజల్ట్ అర్థమైపోయిందని అయితే నిర్మాత అప్పటికే ఈ సినిమా పై భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో మహేష్ సైతం ఏం చేయలేకపోయారని సమాచారం అందుతోంది. మహేష్ కే కాదు చాలామంది హీరోలకు సినిమా షూటింగ్ సగం పూర్తైన తర్వాత ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో లేదో అర్థమవుతుంది. అయితే నెగిటివ్ కామెంట్లు చేయడం వల్ల సినిమా బిజినెస్ పై ఎఫెక్ట్ పడటం తో పాటు నిర్మాత నష్టపోతాడని భావించి మహేష్ బాబు తన నిర్ణయాన్ని మార్చుకోవడం జరిగింది. కొంతమంది దర్శకనిర్మాతలు సైతం మొదట ఒక కథ చెప్పి తర్వాత ఆ కథలో ఇష్టానుసారం మార్పులు చేసి హీరోలను ముంచేసిన సందర్భాలు సైతం ఉన్నాయి. బ్రహ్మోత్సవం సినిమా మహేష్ బాబు సినీ కెరీర్ లో భారీ నష్టాలను మిగిల్చింది.

ఈ సినిమా ఫలితం వల్ల శ్రీకాంత్ అడ్డాలకు సినిమా ఆఫర్లు సైతం అంతకంతకూ తగ్గుతున్నాయి. శ్రీకాంత్ అడ్డాల కెరీర్ పరంగా మరింత బిజీ కావడంతో పాటు కథల విషయం లో మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. కెరీర్ తొలినాళ్ల లో మంచి కథలతో సినిమాలు తీసిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు మాత్రం కథల ఎంపిక లో తడబడుతున్నారు. మహేష్ బాబును అభిమానించే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: