ఇంజనీరింగ్ కాలేజ్ లో అలరించబోతున్న మిల్కీ బ్యూటీ....!!

murali krishna
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా బుధవారం (జులై 26) హైదరాబాద్ లోని ఇంజినీరింగ్ కాలేజీకి రానుంది. రజనీకాంత్ తో ఆమె నటిస్తున్న జైలర్ మూవీ తెలుగు సాంగ్ రిలీజ్ కోసం ఆమె సీఎంఆర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీకి వెళ్లనుంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి కావాలా సాంగ్ తమిళంలో రిలీజైన విషయం తెలిసిందే.ఇప్పుడిదే సాంగ్ తెలుగులో రిలీజ్ కానుంది. దీని కోసమే ఆమె సీఎంఆర్ కాలేజీకి వెళ్లనుంది. అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ సెన్సేషనల్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే తెలుగులో ఈ పాటను ఎవరు పాడారన్నదానిపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్ట్ చేసిన జైలర్ మూవీలో రజనీకాంత్ కు జోడీగా తమన్నా నటిస్తోంది.ఈ సినిమా ఆగస్ట్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరుసటి రోజే రానున్న చిరంజీవి భోళా శంకర్ మూవీతో జైలర్ పోటీ పడనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్, కన్నడ నటుడు శివ రాజ్ కుమార్, నాగేంద్ర బాబు, రమ్య కృష్ణ, సునీల్, యోగి బాబులాంటి వాళ్లు నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించింది.
ఈ సినిమా ఫైనల్ రన్‌టైమ్‌ను రివీలైంది. రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల నిడివితో జైలర్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీలో రజనీకాంత్ పవర్ ఫుల్ జైలర్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. జైలులో ఉన్న కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ను విడిపించేందుకు అతడి అనుచరులు ఆ జైలుపై సడెన్‌గా ఎటాక్ చేస్తారు. ఆ ఎటాక్ ను ఒంటరిగా జైలర్ ఎలా ఎదుర్కొన్నాడనే పాయింట్‌తో ఈ సినిమా రూపొందుతోన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఈ సినిమాలో గ్యాంగ్‌స్టర్‌గా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో శివరాజ్‌కుమార్ కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ఖైదీ ఛాయలతో జైలర్‌ సాగనున్నట్లు ప్రచారం జరుగుతోంది.జైలు ఎపిసోడ్స్ మొత్తం ఖైదీని గుర్తుచేస్తాయని అంటున్నారు. దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో జైలర్ మూవీని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: