దాని గూర్చి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి....!!
అయితే అతడు తన భర్త కాదని, తమకు అసలు పెళ్లే జరగలేదని ఈమె అప్పట్లో పోస్ట్ పెట్టగా అది కాస్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అదేంటి, లాక్‌డౌన్ టైంలో మ్యారేజ్ చేసుకున్నారా కదా అని అనుకున్నారు.ఇప్పుడు ఆ విషయాలపై స్వయంగా ఆమెనే క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న వనితా విజయ్ కుమార్ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ మూడోపెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా వనితా మాట్లాడుతూ.. లాక్‌డౌన్ వల్ల నాలో ఒత్తిడి పెరిగింది.చనిపోతానేమో అని భయమేసింది.
దీంతో నాకు ఎవరైనా కావాలని అనిపించింది. ఒకవేళ నేను చనిపోయినా అప్పటివరకు తోడుంటారు కదా. అయితే నేను మూడో పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు. అలానే పీటర్ పాల్ మంచి వ్యక్తి.అతడి వల్ల జీవితంలో చాలా విషయాలు తెలుసుకున్నాను. నా వరకు చూసుకుంటే.. మాకు పెళ్లి జరగలేదు. జస్ట్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాము.కానీ కొన్నాళ్లకు నేను జీవితాన్ని కోరుకున్నాను. ఆయన వేరే దారిని ఎంచుకున్నారు. నా వరకు వస్తే ప్రేమ చాలా ముఖ్యం. కానీ అది ఓవైపు నుంచి వస్తే ఎలా? నేను ప్రేమ చూపించినప్పుడు అటువైపు నుంచి కూడా లవ్ ఎక్స్‌పెక్ట్ చేస్తాం కదా అని వనితా విజయ్ కుమార్ తెలిపారు. తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా ఈమె చేసిన వాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి.