దాని మీద ఇష్టంతో సినిమా అవకాశాలనే వద్దనుకున్నా వర్ష...!!

murali krishna
జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయిన వర్ష ఈ షో ద్వారా పాపులారిటీని పెంచుకోవడంతో పాటు వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్నారు. ఇతర ఛానెళ్ల నుంచి కూడా వర్షకు ఆఫర్లు వస్తుండగా వర్ష మాత్రం సున్నితంగా ఆ ఆఫర్లను తిరస్కరిస్తున్నారని సమాచారం అందుతోంది.తాజాగా వర్ష ఒక సందర్భంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొంతమంది ఫ్యాన్స్ జూనియర్ సమంత అని పిలిచే వర్ష తనకు సినిమా ఆఫర్లు సైతం వచ్చాయని వెల్లడించారు. ఒక స్పెషల్ సాంగ్ చేసే అవకాశం కూడా వచ్చిందని వర్ష పేర్కొన్నారు. అయితే బుల్లితెరను వదలడం నాకు ఇష్టం లేదని ఆ రీజన్ వల్లే నేను ఆ అవకాశాలకు అంగీకరించలేదని వర్ష వెల్లడించారు. 


ప్రస్తుతం సినిమాలు చేస్తున్నానని ఆమె అన్నారు. అయితే హీరోయిన్ గా చేయాలనే ఆశ మాత్రం లేదని వర్ష వెల్లడించారు.ఫ్రెండ్, అక్క, వదిన తరహా రోల్స్ లో మాత్రమే చేస్తానని ఆమె అన్నారు. త్వరలో తాను ఒక పెద్ద షోకు హాజరవుతున్నానని తన చదువు గురించి, ఇతర విషయాల గురించి అక్కడ చెబుతానని వర్ష వెల్లడించారు. బిగ్ బాస్ షో ఎంట్రీ గురించి వర్ష ఈ విషయాలు చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితం మా చిన్న అన్నయ్యకు యాక్సిడెంట్ అయిందని ఆమె అన్నారు. ఆ సమయంలో అన్నయ్యకు బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడంతో బ్రతకడం కష్టమని డాక్టర్లు భావించారని వర్ష తెలిపారు.

ఆ సమయంలో డాక్టర్ కాళ్లు పట్టుకుని ఎంత ఖర్చైనా బ్రతికించాలని కోరానని వర్ష వెల్లడించారు. రెండు రోజులు వాష్ రూమ్ బయట పడుకున్నానని అన్నయ్య కండీషన్ నాకు మాత్రమే తెలుసని ఆమె అన్నారు. ఆ సమయంలో చచ్చిపోదామని అనుకున్నానని నా అన్నయ్య అంటే నాకు పంచ ప్రాణాలు అని వర్ష వెల్లడించారు. ఆ తర్వాత అన్నయ్య కోలుకున్నాడని ఆమె చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: