సినిమాలకు గుడ్ బై చెప్పనున్న శ్రీలీల....??

murali krishna
ప్రేమ అనేది అందరికీ ఒక సామాన్యమైన విషయంగా మారిపోయింది. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళల్లో ప్రేమ అనేది చాలా చిన్న విషయం. ఇక ఆ ప్రేమను గెలిపించుకొని పెళ్లి చేసుకొని లైఫ్ లాంగ్ కలిసి ఉండటమే గొప్ప అని చెప్పాలి కానీ ఎప్పుడు బ్రేకప్ చెప్పుకుంటారో అర్థం కాని పరిస్థితి ఈ సెలబ్రిటీలది. అందుకే వీరి ప్రేమ వ్యవహారాలు బాగా వైరల్ అవుతూ ఉంటాయి.కొందరు నటీనటులు ఏమాత్రం మొహమాటం పడకుండా తమ ప్రేమ విషయాలు బయటపెడుతుంటే మరికొంతమంది సీక్రెట్ గా ప్రేమ వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. ఇక అవి పెళ్లి వరకు సక్సెస్ అవుతాయి పెళ్లి సమయంలోనే తెలుపుతారు. ఇప్పటికీ చాలామంది సీక్రెట్ లవ్ వ్యవహారం నడిపించి బయటపడ్డారు. ఏదో ఒక మీడియా కంటపడ్డప్పుడో లేదా ఆ వ్యక్తితో వారు పదే పదే కనిపించటమో ఇలా తమ ప్రేమ వ్యవహారాలు బయటపడుతూ ఉంటాయి.

అయితే ధమాకా బ్యూటీ శ్రీ లీల కూడా సీక్రెట్ ప్రేమాయణం నడిపిస్తుందని తాజాగా వార్తలు వినిపిస్తున్నాయి. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ కన్నడ ముద్దుగుమ్మ తన సొంత భాషలో పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ధమాకా సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారి ప్రస్తుతం వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఏకంగా చేతిలో 12 సినిమాలతో బిజీగా ఉంది.అందులో బాలయ్య, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, నితిన్, రామ్, విజయ్ దేవరకొండ, వైష్ణవ్ తేజ్ ఇలా మరి కొంతమంది స్టార్ హీరోల సరసన అవకాశాలు అందుకొని అందనంత ఎత్తులో దూసుకుపోతుంది. పైగా కుర్రాల క్రష్ గా కూడా వారి మదిలో చోటు సంపాదించుకుంది. అయితే ఇదంతా పక్కన పెడితే ఈ బ్యూటీ గురించి ఏ వార్త వచ్చినా కూడా అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది.

ఆ మధ్యనే ఈ బ్యూటీ పెళ్లి జాతకంలో దోషముందని పెళ్లయ్యాక తన భర్తతో విడిపోతుందన్న వార్తలు రాగా.. ఇప్పుడు మరో వార్త ట్రెండ్ అవుతుంది. అదేంటంటే తను సీక్రెట్ లవ్ ఎఫైర్ నడిపిస్తుందని తెలిసింది. తన క్లోజ్ ఫ్రెండ్ అయినా రాకేష్ అనే వ్యక్తితో ఈ బ్యూటీ కొంతకాలం నుండి ప్రేమలో ఉందట. అంతేకాకుండా అతడు కూడా డాక్టర్ అని తెలిసింది.స్వయంగా శ్రీ లీల తల్లి వీరిద్దరి గురించి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి పెళ్లి చేసుకోవటానికి కాస్త టైముందని.. అదేంటంటే శ్రీ లీల కొన్ని సినిమాలు చేసి లైఫ్ లో బాగా సెటిల్ అయ్యి బాగా డబ్బులు సంపాదించుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటుందని తెలిసింది. ఇక తనకు సినిమాలపరంగా కావాల్సినంత డబ్బు వస్తే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుని విదేశాల్లోకి వెళ్లి సినిమాలకు గుడ్ బై చెప్పడం ఖాయమని కూడా తెలిసింది. ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఈ విషయం మాత్రం బాగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: