ఎన్నో ఆశలతో వస్తున్న వైష్ణవ్ తేజ్ 'ఆదికేశవ' మూవీ...!!

murali krishna
వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అందరిని మెప్పించాడు. మొదటి సినిమా తోనే వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. కానీ ఆ తరువాత చేసిన సినిమాలు అంతగా ఆకట్టుకోలేదు.వైష్ణవ్‌ తేజ్ ఉప్పెన సినిమా తరువాత కొండ పొలం,రంగ రంగ వైభవంగా వంటి సినిమాలు చేసాడు.ఆ రెండు సినిమాలు ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయాయి.. అందుకే ప్రస్తుతం చేస్తున్న ఆదికేశవ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ మెగా హీరో.ఈ సినిమా లో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీ లీల నటిస్తుంది.ఈ సినిమాలో శ్రీలీల పాత్ర కూడా ఎంతగానో ఆకట్టుకుంటుందని సమాచారం.
ఈ సినిమాను శ్రీకాంత్‌ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్‌ కార్యక్రమాలు ముగింపు దశకు చేరుకున్నాయి.ఈ సినిమాను ఆగష్టు నెల 18 వ తేదీన విడుదల చేయబోతున్నారు.మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్‌ సినిమా విడుదల కు ఒక్క వారం గ్యాప్ తో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా విడుదల కాబోతుంది.భారీ అంచనాల తో రూపొందుతున్న ఆదికేశవ సినిమా లో వైష్ణవ్‌ తేజ్ కనిపించిన లుక్ అందరిని బాగా ఆకట్టుకుంటుంది.ఇప్పటి వరకు సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించిన ఈ మెగా హీరో మాస్ హీరో ఇమేజ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆదికేశవ సినిమా నుండి విడుదల అయిన లుక్ లో రక్తపు మరకలతో ఉన్న షర్ట్ ను ధరించి సిగరెట్ తాగుతూ ఉన్న ఆ ఫోటోలలో వైష్ణవ్ తేజ్ ఎంతో రఫ్ గా కనిపించాడు..దాంతో ఈ సినిమా మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది అంటూ మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.. ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వైష్ణవ్ తేజ్ ఆదికేశవ సినిమా తో ఆ రేంజ్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: