'బ్రో ' విషయంలో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవ్వబోతుందా...??
దాంతో థియేటర్స్ మూసి వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందువల్ల పవన్ కళ్యాణ్ రేంజ్ వసూళ్లను చూడలేకపోయారు.
ఇక పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం 'బ్రో ది అవతార్' మరో 8 రోజుల్లో మన ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ మొత్తం ప్రారంభం అయ్యాయి. టీజర్ మరియు పాటలు కూడా విడుదల అయ్యింది.సెన్సార్ కార్యక్రమాలు కూడా ఈరోజు మధ్యాహ్నం పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి క్లీన్ U సర్టిఫికేట్ ని జారీ చేసారు. ఈ సినిమా ని చూసిన సెన్సార్ సభ్యులు చెప్పే ఒకే ఒక్క మాట ఏమిటంటే, ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ బెస్ట్ లో ఒకటిగా నిలిచిపోతుంది అని. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ తో సాగిపోతుందట, కానీ సెకండ్ హాఫ్ ఎక్కువగా ఎమోషన్స్ తో నిండిపోయి ఉంటుందట.ముఖ్యంగా చివరి 20 నిముషాలు మాత్రం ఆడియన్స్ చేత కంటతడి పెట్టించేసాడట డైరెక్టర్ సముద్ర ఖని. అలా కాసేపు ఫన్ , కాసేపు ఎమోషన్స్ తో ఆడియన్స్ కి పవన్ కళ్యాణ్ నుండి 'అత్తారింటికి దారేది' తర్వాత బెస్ట్ ఎంటర్టైన్మెంట్ వచ్చిందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ ఎంటర్టైన్మెంట్ జానర్ లోకి వచ్చాడంటే బాక్స్ ఆఫీస్ వేట ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా విషయం లో కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవ్వబోతుందని ,ఫుల్ రన్ లో కచ్చితంగా నాన్ రాజమౌళి ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు.ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి. అయితే ఈ సినిమాకి ఓపెనింగ్స్ మాత్రం పవన్ కళ్యాణ్ స్థాయికి తగ్గట్టుగా ఉండదని ట్రేడ్ పండితులు అంటున్నారు.ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి టికెట్ రేట్ హైక్స్ లేవట. కేవలం స్టాండర్డ్ ప్రైజ్ లోనే టికెట్స్ ని అమ్ముతారట. కాబట్టి ఓపెనింగ్స్ విషయం లో ఈసారికి లైట్ తీసుకోవాల్సిందే అని, ఫుల్ రన్ లో మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.