బేబీ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన సురేఖ వాణి కూతురు..!

Divya
సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా, విరాజ్ అశ్విన్ కీలకపాత్ర పోషించిన చిత్రం బేబీ.. ఈ సినిమా ఈనెల విడుదలై భారీ అంచనాల మధ్య ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతోంది. యూత్ అంతా కూడా ఈ సినిమా కోసం తెగ ఎగబడుతున్నారని చెప్పాలి. ఇకపోతే ఒకపక్క కుండ పోత వర్షం కురుస్తూ ఉన్నప్పటికీ.. మరొక పక్క బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది ఈ సినిమా. ఇప్పటికే ఐదు రోజుల్లోనే రూ.10 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టిన ఈ సినిమా రూ.40 కోట్ల గ్రాస్ మార్కులు అందుకున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఎక్కడ చూసినా ఇంకా హౌస్ ఫుల్ బోర్డులు థియేటర్లలో కనిపిస్తూ ఉండడం గమనార్హం. జనాలు కూడా వర్షాన్ని లెక్క చేయడం లేదు అంటే ఈ సినిమా ఏ విధంగా ప్రేక్షకులను అలరించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు..
ఇకపోతే టాలీవుడ్ సైతం బేబీ సాధిస్తున్న విజయాలను చూసి ఆశ్చర్యపోతోంది. జీనియస్ డైరెక్టర్ సుకుమార్ కూడా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ముఖ్యంగా సాయి రాజేష్ రైటింగ్ కి ఫిదా అయిన సుకుమార్ ఇలా రాయాలని తాను ఎప్పటినుంచో అనుకుంటున్నట్టుగా కూడా తెలిపారు. ఇంతమంది ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తుంటే సురేఖవాణి కూతురు మాత్రం షాకింగ్ కామెంట్స్ చేయడం ఇప్పుడు మరింత వైరల్ గా మారింది.  ఈ సినిమాను చూసి ఆమె బాగా ఏడ్చేసిందట. ఇంతలా ఈ మధ్యకాలంలో తాను ఎప్పుడూ ఏడ్చింది లేదు అంటూ ఎమోషనల్ అవుతూ కామెంట్లు చేసింది ఈ ముద్దుగుమ్మ.
ఇకపోతే ఏది ఏమైనా ఈ సినిమాను ప్రతి ఒక్కరు ఏదో ఒక సీన్ కి కనెక్ట్ అవుతారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఇది మాత్రం చెప్పగలను.. ఒట్టేసి చెబుతున్న వైష్ణవి చైతన్య అదరగొట్టేసింది ఆమెను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది నాకు అంటూ ఎమోషనల్ అయింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికి అయితే ఈ సినిమా ప్రతి ఒక్కరిని మనసుకు హత్తుకుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: