విడాకులు తీసుకోబోతున్న కలర్స్ స్వాతి.. నిజమేనా..!?

Anilkumar
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఎప్పుడు విడిపోతారు అన్నది ఎవరు ఊహించలేం. ఇప్పటికే ఎన్నో జంటలు ఎంతో అన్యోన్యంగా పెళ్లి చేసుకుని కొన్ని సంవత్సరాలు కూడా గడపకుండానే ఉన్నట్టుండి విడాకులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోని తాజాగా ప్రముఖ బుల్లితెర యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుని దాని తర్వాత స్టార్ హీరోయిన్ గా మారినా కలర్స్ స్వాతి సైతం ఇప్పుడు విడాకులు తీసుకోబోతుందని అంటున్నారు. తెలుగులోనే కాకుండా దక్షిణాది భాషల్లో తనదైన నటనతో ఎందరినో ఆకట్టుకుంది కలర్స్ స్వాతి. 

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాలో వెంకటేష్ మరదలుగా నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది కలర్స్ స్వాతి . దాని తర్వాత స్వామి రారా కార్తికేయ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది. అష్టా చమ్మా సినిమాలో అద్భుతంగా నటించి నంది అవార్డును సైతం అందుకుంది. అయితే స్వాతి గత కొద్ది రోజులుగా తన భర్త వికాస్ కి దూరంగా ఉంటుందని అంటున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం స్వాతి తన భర్త ఫోటోలను ఇంస్టాగ్రామ్ నుండి తొలగించింది. అయితే గతంలో సమంత సైతం నాగచైతన్యకు సంబంధించిన ఫోటోలను ఇలాగే డిలీట్ చేసింది. 

ఇటీవల నిహారిక సైతం ఇలాగే చేసింది తాజాగా ఇప్పుడు కలర్స్ స్వాతి సైతం తన సోషల్ మీడియా నుండి ఆమె భర్త ఫోటోలను తొలగించింది. అందుకే ఆమె కూడా విడాకులు తీసుకోబోతుంది అంటూ వార్తలు స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే గతంలో కూడా స్వాతి విషయంలో ఇలాంటి ప్రచారమే జరిగింది. కానీ అప్పట్లో ఆ వార్తలుకి చెట్ పెట్టింది స్వాతి ప్రస్తుతం స్వాతి హైదరాబాదులోనే ఉంటూ పలు సినిమాలు చేస్తోం.ది ఇక ఆమె భర్త వికాస్ మాత్రం థాయిలాండ్ లో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలి అంటే స్వాతి స్పందించాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: