పవర్ స్టార్ ను ఇమిటేట్ చేసిన మెగాస్టార్...!!

murali krishna
వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న చిత్రం భోళా శంకర్‌.. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో తమన్నా భాటియా హీరోయిన్‌గా నటిస్తుంది.మహానటి కీర్తి సురేష్‌ మెగాస్టార్‌ చెల్లెలిగా కనిపించనుంది. అలాగే సుశాంత్‌ మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న భోళా శంకర్‌ ఆగస్టు 11న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. కాగా భోళాశంకర్‌ నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్స్, గ్లింప్స్‌ , సాంగ్స్‌ ఓ రేంజ్‌లో సెన్సేషన్‌ సృష్టించాయి. మరోవైపు ఈ మూవీకి సంబంధించి ఏదో ఒక న్యూస్‌ లీక్‌ చేస్తూనే ఉన్నారు చిరంజీవి. తాజాగా భోళాశంకర్‌ నుంచి మరో సీన్‌ను లీక్‌ చేశారు మెగాస్టార్‌. కాగా ఈ మూవీలో చిరంజీవి పవన్‌ కల్యాణ్‌ అభిమానిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడిదే నిజమైంది. తాజాగా రిలీజ్‌ చేసిన వీడియోలో చిరంజీవి పవన్‌ కల్యాణ్‌ను ఇమిటేట్‌ చేశారు. పవన్‌ నటించిన బ్లాక్‌ బస్టర్‌ మూవీ ఖుషి మూవీలోని యే మేరా జహా పాటను అచ్చం పవన్‌ లాగే ఇమిటేట్‌ చేశారు చిరంజీవి. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా లో షేర్‌ చేయగా, అది క్షణాల్లోనే వైలర్‌గా మారింది.

'ఇన్ని రోజులు పవన్ కల్యాణ్‌ తన ల్లో నన్ను, నా డైలాగులు, నా సాంగ్స్‌కు డ్యాన్స్ చేశాడు. ఇప్పుడు నేను అందరినీ అలరించడానికి భోళా శంకర్‌లో పవన్ మేనరిజమ్‌లను అనుకరిస్తాను. ఆడియెన్స్ వీటిని ఆనందిస్తారని ఆశిస్తున్నాను' అని ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. మెగాభిమానులను భోళాశంకర్‌ వీడియో తెగ ఆకట్టుకుంటోంది. థియేటర్లలో ఈ సీన్‌కి మెగాభిమానులు ఎంజాయ్‌ చేస్తారని, ఇది జస్ట్‌ శాంపిల్‌ మాత్రమే నంటూ చెప్పుకొచ్చారు చిరంజీవి. కాగా ఈ లీక్డ్‌ సీన్‌లో జబర్దస్త్ రష్మీ కూడా కనిపించడం విశేషం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: