అది నచ్చకే సినిమాలు మానేశానంటూ.. ప్రీతి జింగానియా సెన్సేషనల్ కామెంట్స్?
నిజానికి ఈ అమ్మడు వయసు అప్పటికి 36 ఏళ్ళే. అంటే ఇంకా ఆమెకు మూవీ ఇండస్ట్రీలో కొనసాగే అవకాశం ఉంది. అయినా ప్రీతి సినిమాల నుంచి తప్పుకుంది. అందుకు కారణం ఏంటో తాజాగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది. సినిమాలకు దూరమైనా కఫాస్ వెబ్‌సిరీస్ ద్వారా ప్రీతి జింగానియా రీసెంట్‌గా ఓటీటీలో అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
అందులో ప్రీతి మాట్లాడుతూ "మొదట్లో నాకు సినిమా హీరోయిన్‌గా ఛాన్స్‌లు వచ్చాయి. ప్రాధాన్యం ఉన్న అలాంటి పాత్రలు చేయడం అంటే నాకు చాలా ఇష్టం కానీ కాలక్రమేణా ప్రాధాన్యం ఉన్న రూల్స్ నా వద్దకు రాలేదు. నేను కోరుకున్న రోల్స్‌కి తగినట్లు ఒక్క పాత్ర కూడా రాలేదు. వాటితో సంతృప్తి చెందక రిజెక్ట్ చేసేదాన్ని. అలాగని సినిమా మొత్తం నేనే హైలెట్ కావాలని ఎప్పుడూ కోరుకోలేదు. కాకపోతే సినిమాలో నా పాత్రకు ప్రాధాన్యత ఉండాలని అనుకున్నాను. కానీ చివరికి అలాంటి పాత్రలు ఒక్కటి కూడా నా వద్దకు రాలేదు. అలాంటి రోల్స్ చేయడం వల్ల నాకు సంతోషం కలగదు. నా అభిమానులు కూడా డిసప్పాయింట్ అవుతారు. అందుకే సినిమాల నుంచి పూర్తిగా తప్పుకున్నాను" అని చెప్పుకొచ్చింది.