అనసూయ - విజయ్ క్లాష్ పై.. ఆనంద్ దేవరకొండ రియాక్షన్ ఏంటో తెలుసా?

praveen
గత కొంతకాలం నుంచి జబర్దస్త్ యాంకర్ అనసూయ రౌడీ హీరో విజయ్ దేవరకొండ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఇన్ డైరెక్ట్ గా ఇద్దరు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం లేదు. కానీ ఏకంగా అనసూయ మాత్రం విజయ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో చాలానే పోస్టులు పెడుతుంది. ఈ క్రమంలోనే రౌడీ హీరో ఫ్యాన్స్ అటు అనసూయ పై విమర్శలు చేయడం కూడా చేస్తూ ఉన్నారు. అయితే ఇటీవల ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టేందుకు అనసూయ ప్రయత్నించింది అన్న విషయం తెలిసిందే.


 కానీ అనసూయ, విజయ్ దేవరకొండ మధ్య నెలకొన్న క్లాష్ కి సంబంధించిన ఏదో ఒక వార్త తెరమీదకి వస్తూనే ఉంది. కాగా తన సోదరుడు విజయ్ దేవరకొండ నటి అనసూయ మధ్య ఏర్పడిన వివాదం గురించి ఇటీవల రౌడీ హీరో తమ్ముడు ఆనంద్ దేవరకొండ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వ్యక్తిగతంగా అనసూయ పై తనకు ఎలాంటి కోపం లేదు అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. నెగటివ్ లేదా పాజిటివ్ ఇప్పటివరకైతే ఏదైతే జరిగిందో అది పూర్తిగా వాళ్లకు సంబంధించిన విషయం. వ్యక్తిగతంగా ఆమెపై నాకు కోపం లేదు. కాకపోతే నా ఫ్యామిలీని రక్షించుకోవడానికి నేను ఎప్పుడు ముందుంటా అంటూ చెప్పుకొచ్చాడు.


 ఇటీవల బేబీ ట్రైలర్ చూసి అనసూయ ప్రశంసలు కురిపించడంపై స్పందించిన ఆనంద్ దేవరకొండ.. మా ట్రైలర్ నచ్చింది అంటూ అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం సంతోషంగా అనిపించింది. దాదాపు 7 మిలియన్ల మంది మా ట్రైలర్ ను ఇష్టపడ్డారు అంటూ ఇక ఆనంద్ దేవరకొండ కామెంట్ చేశాడు. కాగా విజయ్ దేవరకొండ నటించిన ఖుషీ పోస్టర్ పై ది విజయ్ దేవరకొండ అని ఉండడానికి తప్పుపడుతూ అనసూయ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టింది. ఇక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్ అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కాగా మానసిక ప్రశాంతతను దృష్టిలో పెట్టుకుని తాను ఇక ఈ గొడవకు ఇంతటితో వదిలేయాలనుకుంటున్నాను అంటూ అనసూయ గొడవకు ముగింపు పలికింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: