త్రిబుల్ ఆర్ సినిమాకు సీక్వల్.. కానీ డైరెక్టర్ రాజమౌళి కాదు?
అయితే అప్పటికే ప్రాణ స్నేహితులు అయిన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఇక ఈ సినిమా తర్వాత సొంత అన్నదమ్ముల కలిసిపోయారు అని చెప్పాలి. ఇక ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్న తక్కువే.. కాగా ప్రస్తుతం త్రిబుల్ ఆర్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మరోసారి కలిసిన నటించబోతున్నారని వార్తలు తెరమీదికి వస్తున్నాయ్. ఎన్టీఆర్ చరణ్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతుందని జక్కన్న తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇద్దరు పాన్ ఇండియా హీరోలతో మరో సినిమా ఉంటుందని ప్రకటించారు.
హాలీవుడ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే త్రిబుల్ ఆర్ సినిమాకి సీక్వెల్ అంటూ చిన్న హింట్ ఇచ్చారు విజయంద్రప్రసాద్. ఇక ఈ సినిమాకి దర్శకుడుగా మాత్రం రాజమౌళి ఉండకపోవచ్చు అన్నట్లుగా కామెంట్స్ చేశారు. కానీ రాజమౌళి తాలూకు పర్యవేక్షణ ఉంటుంది అంటూ తెలిపారు విజయేంద్రప్రసాద్. ఈ క్రమంలోనే కొత్త చర్చ తెరమీదకి వచ్చింది. రాజమౌళి కాకుండా దర్శకుడు ఎవరు అనే సందేహం ప్రతి ఒక్కరిలో మొదలైంది. విజయేంద్ర ప్రసాద్ డైరెక్షన్ చేస్తారా లేకపోతే రాజమౌళి తనయుడు దర్శకత్వం వహిస్తారా అన్న విషయంపై కూడా చర్చ జరుగుతుంది.